‘2019లోనూ టీడీపీ-బీజేపీలు కలిసే ఉంటాయి’ | in 2019 also TDP will be BJP allie says Kamineni Srinivas | Sakshi
Sakshi News home page

‘2019లోనూ టీడీపీ-బీజేపీలు కలిసే ఉంటాయి’

Published Wed, Feb 21 2018 1:47 PM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM

in 2019 also TDP will be BJP allie says Kamineni Srinivas - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ-బీజేపీల అవినాభావ అనుబంధం వల్లే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు వచ్చాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధించిందని బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. అందుకే 2019 ఎన్నికల్లోనూ టీడీపీ-బీజేపీలు కలిసే పోటీచేస్తామని తెలిపారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

టీడీపీవి అబద్ధాలే అయినా : ‘‘ప్రత్యేక ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నెన్ని నిధులు ఇచ్చామో ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పిన లెక్కలు మాత్రమే నూరుశాతం వాస్తవాలు. లెక్కల సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా టీడీపీ-బీజేపీలు ఎప్పటికీ కలిసే ఉంటాయి. వైఎస్సార్‌సీపీతో బీజేపీ ఎన్నటికీ దోస్తీ కట్టబోదు’’ అని మంత్రి కామినేని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement