శిశు మరణాలను అరికట్టడంలో కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రం వెనకబడిందని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
తూర్పుగోదావరి: శిశు మరణాలను అరికట్టడంలో కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రం వెనకబడిందని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన కపిలేశ్వరపురం మండలంలోని అచ్యుతాపురంలో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)ను ప్రారంభించారు. విభజన ప్రక్రియ పూర్తకాబోతున్న నేపథ్యంలో దాదాపు 100 మంది డాక్టర్లు రాష్ట్రానికి రానున్నారని తెలిపారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 541 పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని కామినేని అన్నారు.
(కపిలేశ్వరపురం)