child deaths
-
బ్రెయిన్ ఈటింగ్ అమీబా జాగ్రత్త సుమా!
హెల్త్‌డెస్‌్క : కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా ఇటీవల ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన దేశవాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ తరహా అమీబా అనవాళ్లు లేకపోయినా వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలుషితమైన చెరువులు, నీటివనరులతో పాటు సరైన నిర్వహణ లేని స్విమ్మింగ్ పూల్లలో చిన్నారులు ఈదడం వల్ల ఈ తరహా అమీబా వ్యాపించే అవకాశం ఉంది. చిన్నారుల్లో రోగ నిరోధకత తక్కువ కాబట్టి వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు.. నెగ్లేరియా ఫౌలేరీ అని పిలిచే ఈ అమీబా ప్రపంచవ్యాప్తంగా లోతుతక్కువ ఉండే చెరువులు, సరస్సులు, కాల్వలతో పాటు పంటపొలాలు, నేలల్లోనూ నివసిస్తుంది. బాగా వేడిగా ఉండే నీటి బుగ్గల్లో (హాట్ స్ప్రింగ్స్) కూడా ఇది మనుగడ సాగించగలుగుతుంది. ఇది మెదడులో ‘ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ – (పామ్)’ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలుగజేస్తుంది. (ఈ కారణంగానే దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా పేర్కొంటున్నారు) నాడీ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల మరణించే అవకాశమూ ఉంది. చిన్నారులు చెరువులు, ఈత కొలనుల్లాంటి వాటిల్లో ఈదుతున్నప్పుడు ఈ అమీబా వాళ్ల ముక్కు రంధ్రాల్లోంచి మెదడుకు చేరి ‘పామ్’ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. లక్షణాలు» తీవ్రమైన జ్వరం » తీవ్రమైన తలనొప్పి » వికారం, వాంతులు » వణుకు ళీ అయోమయం చివరగా కోమాలోకి వెళ్లే ప్రమాదం » మెదడువాపులో కనిపించే అన్నిలక్షణాలతో పాటు మెడకదలించలేకపోవడం (స్టిఫ్ నెక్), వెలుతురు చూడలేకపోవడం. నిర్ధారణ» లంబార్ పంక్చర్ ప్రక్రియ ద్వారా వెన్నుపాము చివరి భాగం నుంచి నీరు (సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్) తీసి పరీక్షించాల్సి ఉంటుంది. » కొన్నిసార్లు మెదడు బయాప్సీ నిర్వహించి అక్కడ అమీబా ఉనికిని గుర్తించాల్సి ఉంటుంది. నివారణ» కలుíÙత నీటితో కూడిన చెరువులు, కాల్వలు,సరస్సుల వంటి వాటిల్లోకి పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగాఉండే పిల్లల విషయంలో ఇది మరీ ప్రమాదం. » నగరాల్లోని స్విమ్మింగ్ పూల్స్‌లో వాటి నిర్వహణ సరిగా (క్లోరినేషన్ చేయడం, పరిశుభ్రమైన నీటినే వాడటం) ఉందా లేదా? అనే విషయాలను పరిశీలించాకే పిల్లలను పంపాలి. » కొందరు యోగా నిపుణులు ఓ కొమ్ము చెంబు నుంచి నేరుగా ముక్కు రంధ్రం ద్వారా నీటిని బయటకు స్రవించేలా చేసే ‘నేతి’ప్రక్రియ చేయిస్తుంటారు. అయితే మామూలు నల్లా / కొళాయి నీళ్లతో చేసేవారు బాగా మరగబెట్టి చల్లార్చిన నీటితోనే దీన్ని చేయాలి. కలుషితమైన నీళ్లతో చేస్తే పెద్దవారిలోనూ బ్రెయిన్ఈటింగ్ అమీబా తాలూకు ‘పామ్’ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఎంత వేగంగా చికిత్స చేస్తే అంత మేలు దీనికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. కరోనా కేసుల్లో మెదడుకు బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఉపయోగించిన యాంఫోటెరిసిన్–బి వంటి మందులతో పాటు రిఫాపిన్, ఫ్లుకోనాజోల్, మిల్టెఫొసైన్ వంటి మందులను ఉపయోగిస్తారు. (మిల్టెఫొసైన్ను.. శాండ్‌ఫ్లై అనే కీటకాల్లో ఉంటూ లీష్మానియాసిస్ అనే వ్యాధిని కలిగించే పరాన్నజీవి సంబంధిత ఇన్ఫెక్షన్కు ఉపయోగించడానికి ‘ఎఫ్‌డీఏ’అనుమతించింది). త్వరగా వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే అంత మేలు. చిన్నారులకు చల్లటి నీళ్లతో (మరీ చల్లటివి కాదు) స్పాంజింగ్ చేస్తూ జ్వరం తగ్గేలా చేయడం వల్ల వేగంగా కోలుకుంటారు. డా. విజయ్, న్యూరాలజిస్ట్,కిమ్స్ ఐకాన్, వైజాగ్ -
కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు వెనుక కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందడంతో వైద్యులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కలవరపెడుతున్న ఈ శిశు మరణాల్లో మృతి చెందిన శిశువులంతా నాలుగు నెలలలోపు చిన్నారులే. ఆసుపత్రిలో చేరిన చిన్నారులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగానే వారి ఊపిరి ఆగిపోతోంది. దీని వెనుక కారణాలు ఏమిటనేది వైద్యులకు అంతుచిక్కడం లేదు. వరుసగా జరుగుతున్న శిశు మరణాల గురించి వైద్యులు రాష్ట్ర అధికారులకు సమాచారమిచ్చారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం -
శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..
కర్ణాటక: చికిత్స పొందుతున్న 8 నెలల చిన్నారి చనిపోయిందని వైద్యులు భావించి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు మున్నీరైన దంపతులు చిన్నారిని శ్మశానానికి తీసుకెళ్లగా కదలికలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా 90 శాతం నాడి కొట్టుకుంటోందని వైద్యులు గుర్తించి చికిత్సలు ప్రారంభించారు. ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా బసాపుర గ్రామానికి చెందిన బసప్ప పూజార్ కుమారుడు (8 నెలలు) ఊపిరి సరిగా ఆడకపోవడంతో హుబ్లీ కిమ్స్‌లో చేర్పించారు. నాలుగు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు గురువారం సాయంత్రం.. పల్స్రేట్ తక్కువగా ఉందని, ఆక్సిజన్ తొలగిస్తే బిడ్డ బతకదని తెలిపారు. అనంతరం చిన్నారి చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులతో సంతకం తీసుకొని శిశువును అప్పగించారు. శ్మశానానికి తీసుకెళ్లి ఆచారం ప్రకారం నోట్లో పసుపు నీరు పోస్తుండగా బాలుడు ఆశ్చర్యకరంగా చేతులు, కాళ్లను ఆడించాడు. తక్షణమే నవలగుంద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ధార్వాడ సివిల్ ఆస్పత్రికి తరలించారు. నవలగుంద తాలూకా ఆస్పత్రి వైద్యురాలు వై.విద్య మాట్లాడుతూ 90 శాతం మేరకు బిడ్డ ఆరోగ్యంగానే ఉందన్నారు. కిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ బిడ్డ విషయంలో పూర్తిగా కేసు ఫైల్‌ను, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని సమగ్రంగా పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
భారత్‌కు చెందిన ఆ రెండు దగ్గు మందులు వాడకండి.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక!
చిన్న పిల్లల కోసం భారత్‌లో తయారైన రెండు దగ్గు మందులు(సిరప్స్) వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్ మందుల్లో విషపూరితమైన ఇథిలీన్ ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ఈ క్రమంలో చిన్నారులకు ఈ సిరప్స్ ఇవ్వకూడదని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, గతేడాది డిసెంబర్లో ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారులు ఆకస్మికంగా మృతిచెందారు. వారికి మృతికి డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ దగ్గు మందులే కారణమని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. మారియన్ బయోటెక్ తయారుచేసిన దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోపించింది. 21 మంది చిన్నారులు ఈ సిరప్‌లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. దీంతో, అప్రమత్తమైన ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం.. మందులను ల్యాబ్‌లో పరిశీలించగా వాటిలో విషపూరితాలు ఉన్నట్టు గుర్తించింది. దగ్గు మందులో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. అనంతరం, ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో దృష్టికి తీసుకువెళ్లింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్ బయోటెక్ విఫమైందని, సిరప్‌ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్‌తో సూచించింది. దీంతో, డబ్ల్యూహెచ్‌తో సైతం వీటిని వాడరాదంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో కూడా భారత్ చెందిన దగ్గు మంది తాగి గాంబియాలో 66 మంది పిల్లల మరణించారు. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌ల వల్లే వారు మృతిచెందినట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీంతో, ఆ ముందులను కూడా వాడరాదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. "Substandard": WHO Alert On 2 Indian Syrups After Uzbekistan Child Deaths https://t.co/SKxgzPbNy0 NDTV's Vedanta Agarwal reports pic.twitter.com/JMzxKEpZBE — NDTV (@ndtv) January 12, 2023 -
విషాదం: ఫుడ్ పాయిజన్‌తో ఇద్దరు చిన్నారులు మృతి
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే ఓ కుటుంబం శీతల పానియం తాగి పడుకున్నారు. తల్లి బాలమణి(35)తో పాటు, కూతురు మనీషా(13), కొడుకు కుమార్‌కు తీవ్రమైన కడుపు నొప్పి రావటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. తండ్రి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు తూప్రాన్ మండలం వెంకటాయ పల్లి గ్రామానికి చెందిన కుటుంబీకులుగా గుర్తించారు. -
కన్నీటి బావి
కలలకు ప్రతిరూపం వాళ్లు.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు.. తల్లీదండ్రులకు ఆశలు నెరవేర్చే∙సారథులుగా నడుస్తున్నారు.. మంచి చదువు చదివించాలని తాపత్రయం.. కూలీనాలీ చేసుకుని ఉన్నతులుగా చూడాలని ఆశ.. సాఫీగా సాగుతున్న కుటుంబాల్లో ఓ కుదుపు. పిడుగులాంటి వార్త. ఆశల సౌధం కూలిపోయింది.. ఇప్పటి వరకు కబుర్లు చెప్పిన చిన్నారులు కనిపించడం లేదు.. చలనం లేని శరీరాలను చూసి ‘తల్లి’డిల్లిపోయారు.. రెండు కుటుంబాల్లో విషాదం. ఈ ఘటన కలగరలో చోటుచేసుకుంది. విస్సన్నపేట(తిరువూరు): ఇద్దరు చిన్నారులు బావిలో మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కలగర పంచాయతీ రామచంద్రాపురానికి గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు సమీపంలోని రావికుంట చెరువు వద్దకు చేపల పట్టుకునేందుకు వెళ్లారు. ముగ్గురిలో దుబ్బాకు శాంతకమలాకర్ కుమారుడు కౌశిక్(8), సిరెల్లి జక్రయ్య కుమార్తె శ్రావణి(12), జస్వంత్ ఉన్నారు. ముగ్గురు సరదాగా చెరువులో చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. మధ్యలో వీరికి దాహం వేసింది. వెంటనే సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో ఉన్న చిన్న బావి గుర్తుకు వచ్చింది. వెంటనే ముగ్గురు బయలుదేరి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాత ముగ్గురు చేతికి అందె ఎత్తులో ఉన్న నీటిని తాగేందుకు ప్రయత్నించారు. కౌశిక్, శ్రావణి ఒక వైపునే ఉన్నారు. ఈ క్రమంలో బావి అంచు జారిపడిపోయింది. ఇద్దరు బావిలో పడిపోయారు. గమనించిన తోడుగా వచ్చిన జస్వంత్ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న వారు వచ్చి బయటికి తీశారు. అప్పటికే చిన్నారులు ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబాల్లో విషాదం సిరెల్లి జక్రయ్య, సువార్తకు ఇద్దరు కుమార్తెలు. శ్రావణి ఏడో తరగతి చదువుతోంది. శ్రావణి అక్క పదో తరగతి చదువుతోంది. వీరిద్దరు సమీపంలో గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. జక్రయ్య కొంతకాలం కిందట మృతి చెందగా తల్లి ఇద్దరు పిల్లలను కూలీ పనులు చేసుకుంటూ చదివిస్తోంది. విషాద ఘటన తెలుసుకున్న తల్లి కుప్పకూలిపోయింది. కౌశిక్ తండ్రి దుబ్బాకు శాంతకుమలాకర్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కౌశిక్‌కు సోదరి ఉంది. కేసు నమోదు.. ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే ఏఎస్ఐ ఏఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను విచారించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంతో పాటు బావి ఉన్న పొలం రైతులతోనూ మాట్లాడారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
దగ్గు మందు తాగి 9మంది మృతి
సాక్షి, శ్రీనగర్: ఫార్మాసుటికల్ కంపెనీలు మందులు తయారు చేసే ప్రదేశాలు ఎక్కడున్నా ఉత్పత్తులు మాత్రం దేశం నలుమూలలకి వెళ్తుంటాయి. ఏ కొంత నిర్లక్ష్యం వహించినా వాటి వలన జరిగే నష్టం అంచనా వేయలేం. తాజాగా జమ్మూలో చిన్నారులకు దగ్గు మందు కావాల్సి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కంపెనీ వాటి ఉత్పత్తులను జమ్ములోని ఉదంపూర్ జిల్లా చిన్నారులకు పంపింది. అందులో పాయిజన్ కాంపౌండ్ కలిపిన సంగతి తెలియని చిన్నారులు 17 మంది తాగి అస్వస్థతకు గురయ్యారు. గత నెలరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించి 9మంది ప్రాణాలు కోల్పోయారు. 'ప్రైమా ఫేసీ', 'డై ఇథిలీన్ గ్లైకాల్' అనే రెండు విష పదార్థాలు కోల్డ్ బెస్ట్ పీసీ టానిక్‌లో కలిశాయి. వీటి కారణంగానే ఉదంపూర్, ఛండీఘర్లోని చిన్నారుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని' డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ వెల్లడించారు. ఈ దగ్గుమందు కారణంగా ఊపిరితిత్తులు చెడిపోయి మరణాలు సంభవించినట్లు డైరక్టర్ హెల్త్ సర్వీస్‌కు చెందిన డా.రేణు శర్మ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆ కంపెనీ ఉత్పత్తులను 8 రాష్ట్రాల్లో మొత్తంగా 5,500 మందు బాటిళ్లను సీజ్ చేశారు. తయారీ యూనిట్‌ను కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కంపెనీ మందులు సరఫరా అయ్యే ఉత్తరాఖండ్, హర్యానా, తమిళానాడు, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, త్రిపురలో తనిఖీలు చేపడుతున్నట్లు హిమాచల్‌ప్రదేశ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. -
దవాఖానాకు సుస్తీ : గాల్లో కలుస్తున్న పిల్లల ప్రాణాలు
అహ్మదాబాద్ : రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ ఆస్పత్రుల్లో చిన్నారుల మరణాలు కలకలం రేపిన నేపథ్యంలో తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్, జామ్‌నగర్ ఆస్పత్రుల్లో కూడా గత ఏడాది డిసెంబర్లో 179 మంది చిన్నారులు మరణించడం వెలుగుచూసింది. రాజ్‌కోట్‌లో 111 మంది, జామ్‌నగర్‌లో నవంబర్ మాసంలో 71 మంది, డిసెంబర్లో 68 మంది నవజాత శిశువులు మరణించారని గణాంకాలు వెల్లడించాయి. రాజ్‌కోట్ ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబర్లో 111 మంది శిశివులు మరణించారని, వీరిలో కొందరు అండర్‌వెయిట్ చిన్నారులు కాగా, మరికొందరు సెప్పిస్ ఇన్ఫెక్షన్తో మృత్యువాత పడ్డారని ఆస్పత్రి సివిల్ సూపరింటెండెంట్ మనీష్ మెహతా చెప్పారు. ఇక జామ్‌నగర్‌లో గత ఏడాదిగా 639 మంది నవజాత శిశువులు మరణించారు. అహ్మదాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొందని గడిచిన ఏడాది డిసెంబర్లో 85 మంది చిన్నారులు మరణించారని ఆస్పత్రి సూపరింటెండెంట్ గన్వంత్ ఠాకూర్ వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో నెలకు సగటున 70 నుంచి 80 మంది చిన్నారులు మరణిస్తున్నారని, పోషకాహారలోపమే చిన్నారుల మృతికి ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు. చోటా ఉదయ్‌పూర్ జిల్లాలో గత తొమ్మిదినెలలుగా 614 మంది చిన్నారులు మరణించడం కలకలం రేపింది. ఆయా ఆస్పత్రుల్లో పిల్లల వైద్యులు, చైల్డ్ స్పెషలిస్టులు లేకపోవడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రోగుల సంఖ్యతో పోలిస్తే అందుకు అనుగుణంగా గైనకాలజిస్టులు, వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో పిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. -
జవాబుదారీతనం ఉండాలి
కోటా (రాజస్తాన్): రాజస్థాన్‌లోని కోటాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జేకే లోన్ ఆస్పత్రిలో 107 మంది చిన్నారుల మరణాలపై ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ విమర్శించారు. చిన్నారుల మరణం చాలా బాధించిందని, దీనికి ఎవరో ఒకరు జవాబుదారీతనం వహించాలని వ్యాఖ్యానించారు. శిశువుల మరణాలపై ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదన్నారు. ఈ విషయంపై తాము మరింత సున్నితంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలను పైలట్ శనివారం పరామర్శించి ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనపై తాము మరింత బాధ్యతగా ఉండాలి, ఆ తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కోవాలన్నారు. -
మానవత్వం మరుస్తున్న కఠిన హృదయాలు
సాక్షి , ఒంగోలు : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే తమ బిడ్డలను చిదిమేస్తున్నారు.. మానవత్వం మరిచి పేగు బంధాన్ని సైతం తెంచుకుంటున్నారు.. భార్యపై అనుమానంతో ఆమెతో పాటు బిడ్డలను సైతం హతమార్చేందుకు వెనుకాడడం లేదు.. పేగు తెంచుకు పుట్టిన బిడ్డలనే కర్కశంగా రోడ్లపై, వాగుల్లో విసిరి పడేస్తున్నారు.. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కడతేరుస్తున్న కసాయి కొడుకులు.. వృద్ధాప్యంలో తల్లిని భారంగా భావించి రోడ్లపై పడేసి వెళ్తున్న దుర్మార్గపు బిడ్డలు.. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురు, మనమరాళ్ళ వయస్సు ఉన్న చిన్నారులు, యువతులపై కన్నేస్తున్న మృగాళ్ళు.. జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు మానవ సంబంధాలు, రక్తసంబంధాలను సైతం మరిచి కర్కశత్వంతో చిన్నారుల జీవితాలను కాలరాస్తున్న వైనాన్ని చూసి పరిస్థితి ఎటువైపు వెళుతోంది.. ఎక్కడకు దారితీస్తుందో అని జిల్లా వాసులు హడలిపోతున్నారు. జిల్లాలో మూడు నెలలుగా జరుగుతున్న వరుస ఘటనలు అందరి మనస్సులను కలిసి వేస్తున్నాయి. దర్శి పట్టణంలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న అన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఆదెమ్మ అనే వృద్ధ దంపతులు జులై 22వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపడంతో కొడుకే కన్న తల్లిదండ్రులను కర్కశంగా హతమార్చినట్లు తేలింది. వ్యసనాలకు బానిసై అప్పులు చేసి అవి తీర్చేందుకు పథకం ప్రకారం తల్లిదండ్రుల పేరుతో బీమా చేయించి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా అర్ధరాత్రి వారిని దారుణంగా హతమార్చాడు. భార్యపై అనుమానం పెంచుకుని అతి కిరాతకంగా హతమార్చిన సంఘటన ఆగస్టు 17వ తేదీన తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో జరిగింది. 11 ఏళ్లు కాపురం చేసిన భార్యపై అనుమానం పెనుభూతంలా మారి మద్యం మత్తులో ఆమె తలను గోడకేసి కొట్టి చంపాడు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలు పాలు కావడంతో వారి ఇద్దరు బిడ్డలు అనాధలుగా మారి అమ్మమ్మ ఆసరాతో జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు క్షణికావేశంలో చేసిన తప్పులకు బిడ్డలు బలికావాల్సి వచ్చింది. తెలిసి చేసిన పాపమో.. తెలియక చేసిన పాపమో తెలియదుగానీ కొందరు యువతులు పెళ్లి కాకముందే తల్లులుగా మారి పుట్టిన వెంటనే బిడ్డలను విసిరి పారేసి తమ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జులై 30వ తేదీన ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఓ అవివాహిత బిడ్డ పుట్టగానే అక్కడే వదిలేసి వెళ్లింది. చీరాల పట్టణంలోని విఠల్ నగర్లో ఆగస్టు 29వ తేదీ రాత్రి ఓ గర్భిణీ నడి రోడ్డుపై పురుడు పోసుకుంది. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఏం అయిందో ఏమో తెలీదుగానీ పసికందుకు అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. రోడ్డుపై ఏడుస్తూ కొంత సేపటికి ప్రాణాలు విడిచింది. తప్పు చేసిన వారి కడుపున పుట్టడమే ఆ పసికందులు చేసుకున్న పాపం. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి వృద్ధురాలైన కన్న తల్లిని కొడుకులు ఆటోలో తీసుకొచ్చి నడి రోడ్డుపై పడేసి వెళ్ళారు. వర్షంలో తడిచి, చీమలు కుట్టి తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను స్థానికులు 108 ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ తల్లి మృతి చెందింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా కొడుకులు రాకపోవడంతో పోలీసులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా నవంబర్ 1వ తేదీన మరో తల్లిని కొడుకులు ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ 4వ లైన్లో నడి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. హాస్టల్ విద్యార్థినులు గమనించి ఆమెకు అల్పాహారం పెట్టి వృద్ధాశ్రమంలో చేర్చారు. వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులు తాళలేక పేగు తెంచుకు పుట్టిన మూడేళ్ళ పాపను చంపి తానూ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన దుర్ఘటన గుడ్లూరు మండలం చేవూరులో అక్టోబర్ 20వ తేదీన జరిగింది. తాను చనిపోతే తన బిడ్డ అనాథగా మారుతుందనుకుందో ఏమోగానీ తల్లితనాన్నే మరిచి కంటిపాపనే చిదిమేసింది. ఈనెల 9వ తేదీన రాచర్ల బీసీ కాలనీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ తన పోలికలతో లేడని ఏడెనిమిది నెలల వయసున్న కుమారుడిని నేలకేసి కొట్టాడు ఆ కిరాతక తండ్రి. అంతటితో ఆ పసి బిడ్డ గొంతుపై కాలేసి తొక్కి హతమార్చాడు. ఆ ఘోరం చూసి కేకలు పెడుతున్న భార్యను రోకలిబండతో దాడి చేశాడు. ఇటీవల జరుగుతున్న ఈ ఘటనలు జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
మన్యంలో ఆగని చిన్నారుల మరణాలు..
మాయ రోగాలు ఆ ముక్కుపచ్చలారని పసికందులను బలితీసుకున్నాయి. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాయి. పుట్టిన రెండు నెలలకే పిల్లలు కన్నుమూయడంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. సాక్షి, వీఆర్ పురం (తూర్పు గోదావరి): రెండురోజుల వ్యవధిలో ఇద్దరు పసికందులు మృతి చెందిన ఘటన మండలంలోని ఉమ్మిడివరం గ్రామంలో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన కురసం రవి, మంగవేణి దంపతులకు చెందిన రెండు నెలల బాబు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందగా.. అదే గ్రామానికి చెందిన కుర్సం నాగరాజు, అశ్వని దంపతులకు చెందిన రెండు నెలల బాబు కూడా అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై రేఖపల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుందర్‌ప్రసాద్‌ను వివరణ కోరగా.. మంగవేణికి మే నెలలో స్థానిక పీహెచ్సీలో కాన్పు జరిగిందన్నారు. గత నెల 29వతేదీ తెల్లవారు జామున బాబు అనారోగ్యంగా ఉన్నాడని ఆస్పత్రికి తీసురావడంతో పరీక్షించగా గుండె నిమ్ముతో బాధపడుతున్నట్టు నిర్ధారణ కావడంతో భద్రాచలం ఆసుపత్రికి రిఫర్ చేశామన్నారు. అక్కడ ఏరియా ఆస్పత్రి వైద్యులు బాబుకు మెరుగైన చికిత్స అవసరం, వరంగల్ తరలించాలని చెప్పినా శిశువు తల్లిదండ్రులు మాత్రం అక్కడే వైద్యం అందించాలని కోరారన్నారు. ఈ క్రమంలో ఆ శిశువు ఆదివారం మృతి చెందాడన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన కురసం నాగరాజు అశ్వని దంపతులకు చెందిన రెండు నెలల బాబు నాలుగైదు రోజుల నుంచి విరేచనం కాక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆ శిశువును గత శనివారం రేఖపల్లి పీహెచ్‌కి తీసుకురాగా అతడికి చికిత్స చేస్తే విరేచనం అయిందని చెప్పారు. శిశువుకు మెరుగైన వైద్యం అందించాలని చింతూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పినా ఆ దంపతులు పట్టించుకోకుండా ఇంటికి తీసుకువెళ్లారన్నారు. ఆ శిశువు సోమవారం మృతి చెందాడని పేర్కొన్నారు. కాగా శిశువుల మృతితో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు మాచర్ల గంగులు, ఇతర నాయకులు బొడ్డు సత్యనారాయణ మాచర్ల వెంగళరావు, పిట్టా రామారావు, కడుపు రమేష్, చీమల కాంతారావు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడి పరామర్శ ఉమ్మిడివరం గ్రామంలో రెండురోజుల వ్యవధిలో రెండు శిశు మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు వి.గాంధీబాబు, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు సోమవారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. మృతి చెందిన శిశువుల, తల్లుల ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ఆశాకార్యకర్త చేసిన విజిట్స్‌పై, అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించిన పోషకాహారాలపై వివరాలను సేకరించి నమోదు చేసుకున్నారు. ఏయే సమయాల్లో ఏయే ఆస్పత్రుల్లో చికిత్సలు పొందిందీ అడిగి తెలుసుకున్నారు. శిశు మరణాల విషయమై ఇంకా విచారణ చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ శంషాద్‌బేగం ఉన్నారు. -
‘చిన్నారుల మరణానికి బాధ్యత సీఎందే’
పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో 150 మందికి పైగా చిన్నారుల మరణానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధ్యత వహించాలని ఆర్ఎల్ఎస్పీ చీఫ్, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వహ ఆరోపించారు. బిహార్‌ను కాపాడేందుకు నితీష్ కుమార్‌ను సీఎం పీఠం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నితీష్ వైఫల్యాలను వెల్లడిస్తూ తాను జులై 2 నుంచి 6 వరకూ ప్రజల మద్దతు కోరుతూ ప్రదర్శన చేపడతానని వెల్లడించారు. బిహార్‌లో జేడీ(యూ) నేతృత్వంలోని ప్రభుత్వంలో గతంలో భాగస్వామిగా ఉన్న కుష్వహ ప్రజల్లో పార్టీ కోల్పోయిన పట్టును పెంచుకునేందుకు చిన్నారుల మరణాలను హైలైట్ చేస్తూ ప్రదర్శన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆర్‌ల్‌ఎస్‌పీ వర్గాలు పేర్కొన్నాయి. నితీష్ కుమార్ గత 14 ఏళ్ల తన పాలనలో మెదడువాపు వ్యాధిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు. నితీష్ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించేవరకూ తన నిరసన కొనసాగుతుందని కుష్వహ స్పష్టం చేశారు. -
‘మగవాళ్లు గ్రామం విడిచి వెళ్లారు’
పట్నా : బిహార్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా దాదాపు 160 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి.. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేశారు అధికారులు. వివరాలు.. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తూ.. చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో హరివంశపూర్ గ్రామస్థులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు మరణించారంటూ ఆందోళన చేపట్టారు. బాధితుల కడుపుకోతను అర్థం చేసుకుని.. ఓదార్చాల్సింది పోయి.. వారి మీదనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా దాదాపు 39 మంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ విషయం గురించి బాధితుల బంధువులు మాట్లాడుతూ.. ‘మా పిల్లలు చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఆ కోపాన్ని తెలియజేయడానికి రోడ్డు బ్లాక్ చేసి నిరసన తెలిపాం. కానీ అధికారులు మా వాళ్ల మీద కేసు నమోదు చేశారు. దాంతో మగవారు తమను అరెస్ట్ చేస్తారనే భయంతో గ్రామం విడిచి వెళ్లారు. కుటుంబాన్ని పోషించేవారిని అరెస్ట్ చేస్తే.. మా బతుకులు సాగెదేలా’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. Bihar: FIR lodged against 39 people in Harivanshpur, in Vaishali district after they protested over lack of water supply & death of several children due to Acute Encephalitis Syndrome (AES) in the area. pic.twitter.com/opxil6NhL6 — ANI (@ANI) June 25, 2019 చిన్నారుల మృతులపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. చిన్నారుల మృతులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బిహార్, యూపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగే నోటీసులకు బదులు ఇవ్వాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
చిన్నారుల మరణాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
చిన్నారుల మరణాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో మెదడువాపు వ్యాధితో 160 మందికి పైగా చిన్నారులు మరణించిన ఉదంతంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. చిన్నారుల మృతులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బిహార్, యూపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగే నోటీసులకు బదులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చిన్నారుల మరణాలకు బిహార్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, చిన్నారులు మరణించిన ముజఫర్‌పూర్ సహా ఇతర ప్రాంతాలకు వైద్య నిపుణులతో కూడిన ప్యానెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. బిహార్‌లో మెదడువాపు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాలకు వంద మొబైల్ ఐసీయూ యూనిట్లను పంపాలని పిటిషన్ కోరింది. యూపీలోనూ ఈ వ్యాధి లక్షణాలు బయటపడితే ఎదుర్కొనేందుకు సరైన సన్నాహక చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్ తన పిటషన్‌లో డిమాండ్ చేశారు. బిహార్‌లో మరణించిన చిన్నారులకు రూ పది లక్షలు పరిహారం అందచేయాలని, ఈ వ్యాధిపై బిహార్, యూపీ, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించేలా ప్రచారం చేపట్టాలని ఆదేశించాలని కూడా పిటిషన్ కోరింది. పిటిషన్లో పేర్కొన్న అంశాలను ప్రస్తావించిన సర్వోన్నత న్యాయస్ధానం దీనిపై వారంరోజుల్లోగా బదులివ్వాలని ఆయా ప్రభుత్వాకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను పదిరోజుల పాటు వాయిదా వేసింది. -
చిన్నారుల మృతికి కారణాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వందకు పైగా చిన్నారులు ఎక్యూట్ ఎన్ఫలైటిస్ సిండ్రోమ్ (ఏఈఎస్)తో బాధపడుతూ మరణించిన ఘటనపై స్ధానిక ఎంపీ అజయ్ నిషాద్ స్పందించారు. చిన్నారుల మృతులను తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. వడగాడ్పులతో పాటు అపరిశుభ్ర వాతావరణం, పేదరికం, మారుమూల ప్రాంతాల్లో నివసించడం చిన్నారులు ఈ వ్యాధితో మృత్యువాత పడటానికి ప్రధాన కారణాలని ఎంపీ విశ్లేషించారు. రోగులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారు ఉంటున్న ప్రాంతాల్లో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని ఈ పరిస్ధితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు చిన్నారులు చికిత్స పొందుతున్న ముజఫర్‌పూర్‌లోని కృష్ణ మెడికల్ కాలేజి ఆస్పత్రిని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సందర్శించి చిన్నారుల ఆరోగ్య పరిస్ధితిని సమీక్షించారు. ముజఫర్‌పూర్‌లో ఏఈఎస్ వ్యాప్తి ప్రబలిన రెండు వారాల తర్వాత సీఎం ఆస్పత్రిని సందర్శించడం పట్ల రోగుల బంధువులు బిహార్ సీఎం నితీష్ కుమార్ రాకను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. -
సర్వజనాస్పత్రిలో పసికందుల మృతి
అనంతపురం న్యూసిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఆదివారం ఇద్దరు పసికందుల మృతి తీవ్ర వివాదానికి దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందులు మృత్యువాత పడ్డారని బాధిత కుటుంబీకులు ఎస్ఎన్సీయూ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బుక్కరాయసముద్రం మండలం వడియంపేటకి చెందిన లక్ష్మిదేవి, ఎర్రిస్వామిల పాప(1.3 కేజీలు), కళ్యాణదుర్గానికి చెందిన గీతమ్మ, గంగయ్య పాప(2కేజీలు) ప్రీమెచ్యుర్డ్ బేబీలు. వీరిని ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో ఔట్‌బార్న్ యూనిట్లో చేర్పించారు. వీరు సాయంత్రం 6 గంటల సమయంలో మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబీకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికున్న పిల్లలను ఇస్తే, వారి ప్రాణం లేకుండా ఇచ్చారని కన్నీరుపెట్టారు. యూనిట్లో ఏసీలు పనిచేయడం లేదని, ఉదయం నుంచి ఐదు మంది చనిపోయారంటూ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఔట్‌పోస్టు ఏఎస్ఐ రాము తదితరులు బాధిత కుటుంబీకులను నచ్చజెప్పడంతో సమస్య సద్దుముణిగింది. వద్దు బాబోయ్ ఎస్‌ఎన్‌సీయూలో ఇద్దరు చిన్నారులతో మృతి కలకలం రేగడంతో అక్కడే ఉన్న రెండు కుటుంబాలు తమ పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు చెబుతున్నా..హైయ్యర్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తామంటూ వెళ్లిపోయారు. చివరకు వైద్యులు వారితో సంతకాలు చేయించుకుని డిశ్చార్జ్ చేశారు. మెరుగైన సేవలందించాం ఇద్దరు పసికందుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. రెండు ప్రీమెచ్యూర్డ్ బేబీలు. పుట్టగానే ఏడవలేదు. దీంతో వారు కోలుకోవడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. కానీ రౌండ్ ద క్లాక్ మెరుగైన సేవలందించాం. అమాయక ప్రజలకు తెలియక మాపై ఆరోపణలు చేస్తున్నారు. – డాక్టర్ శ్రీధర్ -
ఉసురు తీస్తున్న నిర్లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో :గోల్కొండ పరిధిలోని కుతుబ్‌షానగర్‌కు చెందిన ఫాతిమా (2) ఇంటి ముందు ఆడుకుంటూ మూతలేని నీటి సంపులో పడి కన్నుమూసింది. ♦ డీడీ కాలనీకి చెందిన చిన్నూ (3) ఆడుకుంటూ బాత్రూమ్లోకి వెళ్లి నీళ్ల బక్కెట్లో పడి చనిపోయింది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఓ ఇంటి వెనుక భాగంలో నిర్మించిన డ్రైనేజ్ గుంతలో పడి రియా (2) అశువులు బాసింది. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన నిర్లక్ష్యం తాలూకు ఘోరాలు ఇవి. ♦ తాజాగా గురువారం మూసారంబాగ్ డివిజన్ బడా మజీద్ లైన్లో షేక్ యాకుబ్ కుమారుడు రెహమాన్›(5) ఆడుకుంటూ సంపులో పడి చనిపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలాంటి దుర్ఘటనల్లో కన్ను మూసిన వారంతా లోకం పోడక తెలియని పసిమొగ్గలు... తల్లిదండ్రులు, అధికారుల నిర్లక్ష్యంతో పాటు అనాలోచిత నిర్ణయాల కారణంగా నిత్యం పలువురు మృత్యువాత పడుతున్నారు. చిన్నారులకు కుతూహలమే... అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న చిన్నారులకు ప్రతి అంశం పట్ల కుతూహలం, నేర్చుకోవాలని, దగ్గరగా చూడాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయవద్దని పెద్దలు వారిస్తుంటారో... అదే చేసేందుకు వారు ఆసక్తి చూపుతారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు నీళ్లు సైతం వీరిని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. తరచూ వాటి వద్దకు వెళ్లాలని, ఆడుకోవాలని చూస్తుంటారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో నీటితొట్టెలు, బక్కెట్లు, సంపులు వీరికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే చిన్నారుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రుల పైనే ఉంది. దిగువ మధ్య తరగతివారే ఎక్కువ... ఇటీవల నగరంలో చోటు చేసుకున్న చిన్నారులకు సంబంధించిన అపశృతులను పరిశీలిస్తే ఇలాంటి ఉదంతాలు ఎక్కువగా దిగువ మధ్య తరగతి అంతకంటే కింది స్థాయిలో ఉన్న కుటుంబాల్లోనే జరుగుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. వారిలో విద్యాప్రమాణాలు తక్కువగా ఉండటం, అవసరమైన స్థాయిలో పరిపక్వత లేకపోవడం కూడా పిల్లల పట్ల నిర్లక్ష్యానికి కారణంగా మారుతున్నట్లు చెబుతున్నారు. అలాగని మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లోని చిన్నారులు పూర్తిగా సురక్షితంగా ఉంటున్నారనీ చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. అక్కడే అడపాదడపా అపశృతులు చోటు చేసుకుంటున్నాయని వివరిస్తున్నారు. మరెన్నో కారణాలు... ‘సంపు’ బాధిత కుటుంబాల్లో అనేకం వలస వచ్చినవే ఉంటున్నాయి. వీరికి స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండకపోవడం, ప్రస్తుతం జరుగుతున్న సంపుల నిర్మాణం, వాటి వల్ల జరిగే ప్రమాదాల తీవ్రత తెలియట్లేదు. ఫలితంగానే చిన్నారుల విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీనికితోడు ఇటీవల కాలంలో అన్నీ చిన్న కుటుంబాలే కావడంతో పాకాడే పసి పిల్లల ఆలనాపాలనా, ఇంటి పనులు రెండూ తల్లిదండ్రులే చూసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానూ పిల్లలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. వీరి కదలికల్ని కనిపెట్టడం, కట్టడి చేయడంలోనూ విఫలం కావడం పూడ్చలేని నష్టాన్ని మిగుల్చుతూ కుటుంబాన్నే దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యమూ చిన్నారుల ఉసురు తీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఉండే గోతులు, సంపులు, నీటి గుంటలు, ఫౌంటేన్లు, ఇంకుడు గుంతల నిర్వహణ, వీటికి సరైన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక ఓపెన్ నాలాలు, మ్యాన్‌హోళ్ల విషయం వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీకూడా అపశృతులకు కారణంగా మారుతున్నాయి. సంపులో పడి బాలుడు మృతి మలక్‌పేట: సంపులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన గురువారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఆయూబ్, శంషాద్ బేగం దంపతులు మూసారంబాగ్ డివిజన్, బడా మజీద్ లైన్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఆయూబ్ అంబర్‌పేటలో తాళాలు రిపేర్ చేస్తు జీవనం సాగిస్తున్నాడు. వారి ఇంటికి ఎదురుగా ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన సయ్యద్ అతియా ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా భవనం గ్రౌండ్ ఫ్లోర్లో నీటి సంపు ఏర్పాటు చేశాడు. అయితే భవనం చుట్టు ఎలాంటి రక్షణ లేకపోవడంతో సంపుపై మూత బిగించలేదు. ఆయూబ్ కుమారుడు షేక్ అబ్ధుల్ రెహమాన్›(5) గురువారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. అతడి ఆచూకీ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా రహమాన్ ఎదురుగా ఉన్న భవనం నీటి సంపులో తేలియాడుతూ కన్పించాడు. కుటుంబసభ్యులు అతడిని మూసారంబాగ్ చౌరస్తాలోని సేఫ్ చిల్డ్రన్ ఆసుపత్రికి తరలింయగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. దీనిపై సమాచారం అందడంతో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అస్లాం, ఎంఐఎం నాయకులు ఇలియాస్, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి సోహేల్, పోలం రవీందర్‌యాదవ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మలక్పేటఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు పర్యవేక్షలో ఎస్సై శ్రీనునాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు అవసరం ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా తల్లిదండ్రులు సైతం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చిన్నారులు ఇంట్లో, ఇంటి బయట ఆడుకునేప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచాలి. ఎవరికి వారు తమ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు, భవనాలకు సంబంధించిన సంపులు, డ్రైనేజీలు, పిల్లర్ గుంతల విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవసరమైతే వాటి యజమానులు, అధికారుల్ని అప్రమత్తం చేయాలి. మూతలేని మ్యాన్‌హోళ్లు, ప్రమాదకరంగా మారిన ఓపెన్ నాలాలు కనిపిస్తేప్రతిఒక్కరూ బాధ్యతగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారమ య్యేలా చూడాలి. – నగర పోలీసు ఉన్నతాధికారి -
అందమైన లోకం.. పుట్టుకే శోకం
మాతా శిశు సంరక్షణ అంటూ ప్రభుత్వాలు గొప్పగా ప్రచారం చేస్తుంటే అమ్మ కడుపులో ఉన్న శిశువులు ఎంతో సంతోషించారు. తమ ఆరోగ్యం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. అంటూ ఆశ్చర్యపోయారు. అందమైన లోకాన్ని చూసేందుకు తొమ్మిది నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని వేయి కళ్లతో నిరీక్షించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరు లోకాన్ని చూడకనే అమ్మ గర్భంలోనే కన్నుమూయగా.. మరో చోట పుట్టిన శిశువు అనారోగ్యంతో ఆసుపత్రికి చేరినా బతకలేక పోయింది. బిల్లు కడితేనే మృత శిశువును అందిస్తాన్న ఆసుపత్రి సిబ్బంది నిర్వాకాన్ని చూసి ఇదేం లోకం.. పుట్టుకే శోకం అంటూ ఆ శిశువు ఆత్మ ఘోషించింది. ఆదివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు అటు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఇటు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని తేటతెల్లం చేశాయి. కర్నూలు, బొమ్మలసత్రం: వైద్యం.. వ్యాపారంగా మారిన నేపథ్యంలో కొందరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నారు. ఆదివారం నంద్యాలలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన ఖాజా హుస్సేన్ తన భార్య హుసేన్‌బీని ప్రసవం నిమిత్తం గత నెల 28న పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో ఉమ్ము నీరు తాగిన శిశువు అస్వస్థతకు గురి కావడంతో పక్కనే ఉన్న లిటిల్ స్టార్ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు పాప ఆరోగ్యం బాగా లేదని ఇక్కడే వారం రోజులు చికిత్స అందించాలని చెప్పారు. ఈనెల 6వ తేదీ వరకు చికిత్స అందించి దాదాపు రూ.1.55 లక్షలు బిల్లు కావడంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పు తీసుకొచ్చి వైద్యునికి చెల్లించారు. అదే రోజు శిశువును ఐసీయూ గది నుంచి సాధారణ వార్డుకు మార్చారు. అయితే ఆయాసంతో బాధపడుతుండటంతో మళ్లీ పరీక్షలు చేశారు. కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకిందని, రక్తంలో ప్లేట్లేట్స్ తక్కువగా ఉన్నాయని, వీటన్నింటికీ చికిత్స అందించాలంటే భారీగా ఖర్చువుతుందని చెప్పారు. తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోవటంతో తిరిగి చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలోనే మందులు, అడ్వాన్స్ అంటూ డబ్బులు భారీగా వసూలు చేశారు. అయితే శనివారం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని.. మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టామని, ఎలాగైనా బతికించాలని శిశువు తల్లిదండ్రులు వేడుకున్నా రు. 20 రోజులకే రూ. 3 లక్షల బిల్లు కాగా రూ. 2.70 లక్షలు చెల్లించారు. అయితే శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో శిశువు మృతి చెందిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అయితే మిగతా రూ.30 వేలు కట్టి మృత శిశువును తీసుకెళ్లాలని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆవేదనకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి తమ బిడ్డ చివరి చూపు చూసేందుకు అనుమతించాలని కోరినా ఒప్పుకోలేదు. అప్పటికే లక్షలు ఖర్చు చేసినా వారికి పాప దక్కక పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించినా ఆసుపత్రి యాజమాన్యం చలించలేదు. సమాచారం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్, పీడీఎస్టీ, ఆర్‌వైయూ తదితర ప్రజా సంఘాలు నాయకులు రాజు నాయుడు, ధనుంజేయుడు, రఫి తదితరులు ఆసుపత్రికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేçశం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు తెలుసుకొని సంబంధిత ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఆనంద్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం చిన్నారి మృత దేహాన్ని బంధువులకు అప్పజెప్పడంతో ఆందోళన విరమించారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత పుట్టిన పాపను ఎలాగైనా బతికించుకోవాలనే తల్లిదండ్రుల ఆరాటాన్ని ఆసుపత్రి యాజమాన్యం సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసేందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదోని టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళకు కడుపుకోత మిగిలింది. ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామానికి చెందిన మహబూబ్ బాషా, ఎస్.మోయిద్దీన్బీ దంపతులకు ముగ్గురు కుమారులు. కుమార్తె కోసం నాలుగో కాన్పునకు మోయిద్దీన్బీని శనివారం సాయంత్రం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవీలతకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి గర్భిణినిని పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని తేల్చి చెప్పారు. మృత శిశువును బయటకు తీసేందుకు మోహిద్దీన్బీని వార్డులో అడ్మిట్ చేశారు. అర్ధరాత్రి సమయం కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కడుపు నొప్పితో ఆమె తీవ్రంగా బాధపడుతున్నా అటు వైపు సిబ్బంది కూడా రాలేదు. నొప్పిని భరించలేక వార్డు నుంచి ఆసుపత్రి గేట్ వద్దకు రాగానే కింద పడిపోయింది. ఆ సమయంలోనే కడుపులో ఉన్న మృత ఆడ శిశువు బయటపడింది. కాన్పు తర్వాత అస్వస్థతకు గురైన ఆమెకు చికిత్స అందించారు. సకాలంలో వైద్యం చేసి ఉంటే ఇంతటి పరిస్థితి ఉండేది కాదని బాధితురాలు రోదించింది. కుమార్తె కావాలన్న ఆమె కల కరిగిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. -
పెద్ద వయసు డాడీ.. పెను సమస్యల దాడి
మగాడికేముంది? ఏ వయసులోనైనా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చు. కానీ మహిళలకు అలా కాదు కదా.. సమాజంలో పేరుకుపోయిన ఓ అభిప్రాయం ఇది. శరీర నిర్మాణ వైవిధ్యాలు కూడా దీనికి అనుగుణంగా ఉండడంతో ఇది అంతకంతకూ బలపడుతూ వచ్చింది. అయితే పెద్ద వయసులో తండ్రి కావడం వల్ల మగవాళ్లకు కాకపోయినా అలా పుట్టే పిల్లలకు రకరకాల సమస్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఓ సర్వే. తగిన వయసులో పెళ్లి, పిల్లల్ని కనడం అవసరమని సూచిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో : కేరీర్, ఆర్థిక భద్రత కోసం.. నలభై ఏళ్లకు కాస్త అటూ ఇటూగా వయసు ఉండే మగవాళ్ల చేతుల్లో నెలల పసికూనలు.. కనపడడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణం. రకరకాల కారణాలు పెళ్లిని, ఆ తర్వాత సంతాన భాగ్యానికి అడ్డుతగులుతున్నాయి. ఎంచుకున్న కెరీర్‌కు అనుగుణంగా చదివే చదువులు పూర్తయ్యేటప్పటికి కనీసం పాతికేళ్లు నిండుతున్నాయి. ఆ తర్వాత ఉద్యోగమో, మరో రంగంలోనో స్థిరపడేటప్పటికి మరో ఐదేళ్లు, ఇల్లు, తగినంత ఆర్థిక భద్రత కోసం మరో నాలుగైదేళ్లు.. ఇలా ప్రస్తుతం మగవాళ్లు పెళ్లి చేసుకునే వయసు అటూ ఇటుగా 35 ఏళ్లకు చేరింది. ఆ తర్వాత వీళ్లకి సంతానం కలిగేసరికి మధ్యవయసు వస్తోంది. గుండెలపై చిన్నారి పాదాలు నృత్యం చేయడం, కన్నబిడ్డ చేత నాన్నా అని పిలిపించుకోవడం.. పురుషులకి ఓ మధురానుభూతి. పితృత్వపు ఆనందం సంపూర్ణంగా పొందాలంటే తగిన వయసులోనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి లేని పక్షంలో ఎదురయ్యే సమస్యలు ఆ అనుభూతిని హరించివేసే ప్రమాదం ఉంది. దీనిపై నగరంలోని ఇందిరా ఐవీఎఫ్ సెంటర్‌కు చెందిన ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి మోతె చెప్పిన విశేషాలివీ.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. మహిళల్లో పెద్ద వయసు కారణంగా సంతాన ప్రాప్తికి అవసరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలహీనపడడం, మోనోపాజ్ సమీపించే ప్రమాదాలు ఉంటాయి. మగవాళ్లలో అలాంటి సమస్య ఉండదని భావిస్తారు. ఈ తరహా ఆలోచనలతో పెద్ద వయసు తండ్రులకు పిల్లలు జన్మించడం అనేది ఒకప్పటితో పోలిస్తే బాగా పెరిగింది. ఉదాహరణకు 40 ఏళ్లు దాటిన తర్వాత తండ్రులు కావడం అనేది దశాబ్దాల క్రితం 4శాతం కాగా ఇప్పుడు 10శాతం. మగవాళ్లలో మధ్య వయసు దాటాక సంతానలేమితో పాటు ఒకవేళ పిల్లలు పుట్టినా.. వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన తేల్చింది. సర్వే ‘జననా’.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటిస్టిక్స్లు నమోదు చేసిన దాదాపు 40 మిలియన్ల జననాల రికార్డ్స్‌ను విశ్లేషించిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ అంశాలను వెల్లడించింది. గత అక్టోబరు 21న బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఆ పరిశోధనా ఫలితాల ప్రకారం.. తండ్రి వయసు కూడా తల్లీ, పిల్లలపై ప్రతికూల ప్రభావాలకు కారణమవుతోంది. తండ్రి వయసు సగటు 35 ఏళ్ల అయిన పక్షంలో జనన ప్రమాదాల్లో కొద్దిగా హెచ్చుదల ఉంటుందని, వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి పురుషుడి డీఎన్ఎలో జరిగే రెండు నూతన ఉత్పరివర్తనలు జనన శిశువులకు ప్రమాదకరంగా పరిణమిస్తాయి స్పష్టం చేసింది. కనీసం 35ఏళ్లు దాటిన తండ్రులు కన్న బిడ్డల్లో అత్యధికులకు జనన సమయంలో ప్రమాదావకాశాలు హెచ్చుగా ఉంటున్నాయి. అలాగే మధ్య వయసు తండ్రుల పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. అంతేకాదు పుట్టిన వెంటనే వెంటిలేషన్ అవసరం ఏర్పడుతోంది. తండ్రి అయ్యే వయసు మరింత పెరుగుతున్న కొద్దీ పిల్లలకు ప్రమాదావకాశాలు కూడా పెరుగుతున్నాయి. వయసు 35 కన్నా మించిన వయసులో తండ్రి అవుతున్నవారికి నెలలు నిండని పిల్లలు పుట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వయసు 50 దాటిన తండ్రుల్లో 28 శాతం మందికి పుట్టిన బిడ్డ నియోన్యాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చేరాల్సిన అవసరం ఏర్పడుతోంది. తల్లికీ ముప్పే.. వయసు దాటాక తండ్రి అవుతున్న పురుషుల కారణంగా ఆ బిడ్డలను కన్న తల్లులు సైతం కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారని పరిశోధన వెల్లడించింది. తండ్రి వయసు ప్రభావం తల్లి గర్భధారణపై రకరకాలుగా ఉంటుంది. ఇలాంటి తల్లులకు ప్రసూతి సమయంలో మధుమేహంవచ్చే అవకాశాలు ఉన్నాయి. తగిన వయసులోనే మేలు.. తగిన వయసులో పెళ్లి చేసుకుని పిల్లలను కనడం మంచిది. వీలైనంత వరకూ పెళ్లయిన తర్వాత ఎక్కువ కాలం పిల్లలను వాయిదా వేయకపోవడం అవసరం. వయసు మీరాక పెళ్లి– పిల్లలు అనే పరిస్థితి నుంచి పుట్టే సమస్యలపై ప్రస్తుత తరంలో అవగాహన పెరగాల్సి ఉంది. – డాక్టర్ స్వాతి మోతె -
డెలీ'వర్రీ'
రాజమహేంద్రవరం రూరల్, బొమ్మూరు కు చెందిన శీలం కనక దుర్గ గర్భిణి. నెలలు నిండడంతో నవంబర్ 25న పురుడు పోసుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. 26వ తేదీన ఆపరేషన్ చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన నవజాత శిశువుకు మంగళవారం వ్యాక్సిన్ వేశారు. సాయంత్రం పాపకు జ్వరం రావడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లగా వ్యాక్సిన్ వేసిన పాపకు జ్వరం అలానే వస్తుందని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అయితే రాత్రంతా పాప జ్వరంతో బాధపడగా 27వ తేదీ మధ్యాహ్నం ఆమెను డాక్టర్ల వద్దకు తీసుకువెళితే మృతి చెందినట్టు చెప్పారు. డాక్టర్లు పాపను పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందినట్టు ఆరోపించి ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి , తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లీబిడ్డల విభాగంలో మాతా శిశుమరణాలు తగ్గడం లేదు. ఈ ఆసుపత్రిలో వారంలో ఎవరో ఒకరు మృత్యువాతపడుతూనే ఉన్నారు. ప్రభుత్వ డాక్టర్లు తమ తప్పులేదని చేతులు దులుపుకొంటున్నా భారీ మూల్యం చెల్లించేది మాత్రం రోగులే. డబ్బులు పెట్టి ప్రైవేటు వైద్యం చేయించుకోలేని ఎందరో ఈ ఆసుపత్రికి వస్తున్నా.. ఇక్కడ వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన పెన్నింటి నాగలక్ష్మి నవంబర్ 14న పురుడు కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 15వతేదీ డ్యూటీ డాక్టర్ శాంతి ప్రియ ఆపరేషన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి బిడ్డను తీయడం వల్ల కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచారు. మధ్యాహ్నం బాత్ రూమ్‌కు వెళ్లేందుకు బెడ్ నుంచి కిందకి దిగిన నాగలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. బాలింతలకు సమీపంలో బాత్ రూమ్‌లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని నాగలక్ష్మి బంధువులు ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, పురుడుపోసుకునేందుకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఒకే సారి సీనియర్ సిబ్బందిని బదిలీచేయడంతో గైనిక్ విభాగంలో వైద్య సేవల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రోగులు పేర్కొంటున్నారు. గర్భిణులకు పరీక్షలు చేసే సమయం కూడా సిబ్బందికి ఉండడం లేదు. రోజుల తరబడి పురుడుపోసుకునేందుకు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రçసూతి విభాగంలో ప్రస్తుతం ఏడుగురు డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో ఒక డాక్టర్ మెటర్నటీ లీవ్‌లో ఉన్నారు. మిగిలిన ఆరుగురు డాక్టర్లలో ఒకరు రాత్రి సమయాల్లో డ్యూటీ నిర్వహించేందుకు కేటాయించగా ఐదుగురు రోజు వారీ విధులు నిర్వహిస్తుంటారు. రోజుకు కనీసం 10 నుంచి 15 వరకు పురుళ్లు పోయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. విపరీతమైన ఒత్తిడిలో డాక్టర్లు విధులు నిర్వహించాల్సి వస్తోంది. వీటితోపాటు గర్భిణుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తి వారికి రక్తం ఎక్కించడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. దీంతో తల్లి గాని నవజాత శిశువుల గాని మృత్యువాత పడుతుండడం సర్వసాధారణమైంది. ఒకేసారి సిబ్బంది బదిలీ వైద్య విధాన పరిషత్‌లో సిబ్బంది బదిలీలు రోగుల పాలిట శాపంగా మారింది. ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన వారిని బదిలీలు చేయడం వల్ల రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న 69 మందిని ఒకే సారి బదిలీలు చేయడం వల్ల పలు విభాగాల్లో సకాలంలో సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా వైద్య సేవలు పొందేందుకు వస్తుంటారు. వీరితో పాటు రోజు సుమారు 600 మంది వరకు అవుట్ పేషంట్లు వస్తుంటారు. వారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. ఇక్కడ పని చేసే నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్ అటెండెంట్, ఇద్దరు ఓటీలు, 15 మంది స్టాఫ్ నర్సులు, ఏడుగురు ట్రామా కేర్ సిబ్బంది, ఏడుగురు ఎంఎన్ఓలు, నలుగురు ఎఫ్ఎన్ఓలు, ఒక జేఎస్‌డబ్ల్యూ, జిల్లా కేడర్‌కు చెందిన 44 మంది, జోనల్ కేడర్‌కు చెందిన 25 మంది మొత్తం 69 మంది సిబ్బంది బదిలీ అయ్యారు. దీంతో మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు. కొత్త ఐసీయూ ఏర్పాటు చేశాం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో కొత్తగా ఐసీయూ ఏర్పాటు చేశాం. డాకర్లు, సిబ్బంది కొరత ఉంది. కనీసం 10 మంది డాక్టర్లు, మరో 20 మంది స్టాఫ్ నర్సులు ఉండాలి. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే పరిష్కారం అవుతుంది. ఎక్కువ సంవత్సరాలు ఒకే చోట విధులు నిర్వహించిన వైద్య సిబ్బందిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ చేశాం. కొత్తవారు విధుల్లోకి చేరారు. ఉన్న వారితో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.– టి.రమేష్ కిశోర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
బాలలను వెంటాడుతున్నపౌష్టికాహార లోపం
జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి తరచూ అనారోగ్యం పాలవుతోంది. వైద్యుల వద్దకు తీసుకెళ్తే చిన్నారిలో పోషకాహార లోపం ఉందని చెప్పారు. దీనివల్లే తరచూ అనారోగ్యానికి గురవుతోందని నిర్ధారించారు. ఆ పాప వయసును బట్టి చూస్తే.. 10 కిలోల వరకు బరువు ఉండాలి. కానీ ఆరున్నర కిలోలు మాత్రమే ఉంది. ఈ ఒక్క చిన్నారే కాదు.. జిల్లాలోని చాలా మంది బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. చలాకీగా ఆడుతూ.. పాడుతూ ఎదగాల్సిన బాల్యం పోషకాహార లేమితో బక్కచిక్కి పోతోంది. అధికారులు బయటకు చెప్పకపోయినా జిల్లాలో రక్తహీనత.. పోషకాహార లోపంతో మరణించే వారి సంఖ్య అధికమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో పోషకార లోపంతో తీవ్రంగా బాధపడుతున్న పిల్లల సంఖ్య 1849 కాగా అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది. సాక్షి కడప : బాల్యం పౌష్టికాహారం కొరతతో హాహాకారాలు చేస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులు ఆనందంగా ఎగరలేని పరిస్థితి. ఆటలు ఆడాలని ఉన్నా.. పాటలు పాడాలని ఉన్నా... ఏమీ చేయలేని నిస్సహాయత... అందరిలాగా ఉత్సాహంగా ఉరకలెత్తాలనే ఆశ ఉన్నా బాల్యంపై రక్తహీనత నాట్యం చేస్తోంది. ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు వారి మనసుల్లో పుట్టుకొస్తున్నా పౌష్టికాహార లోపం అనే రోగం వారిని నిత్యం కుంగదీస్తోంది. వయస్సు పెరుగుతున్నా.. బరువు మాత్రం పెరగకుండా అనారోగ్యం చిన్నారులను చిదిమేస్తోంది. ఒకవైపు పేదరికం.. మరోవైపు అధికసంతానం...ఇంకోవైపు ఆర్థిక సమస్యలతో పిల్లలకు సక్రమంగా... సంపూర్ణంగా ఆహారం అందించలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే చిక్కి శల్యమవుతున్న పిల్లలను చూస్తూ.. ఏమీ చేయలేని దీనస్థితిని తలుచుకుంటూనే కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక పథకాల పేరుతో హడావుడి చేస్తున్నా... పాలకులు కంప్యూటర్ యుగంలో ఆకాశాన్ని తాకేలా అభివృద్ధి చేశామని జబ్బలు చరుచుకుంటున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల ఫలం పూర్తి స్థాయిలో అందక అల్లాడిపోతున్న బాలల దయనీయ స్థితిని బాలల దినోత్సవం రోజైనా అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వేటాడుతున్న పౌష్టికాహార లోపం జిల్లాలో 30 లక్షలకు పైగా జనాభా ఉండగా, 1,74,212 మంది చిన్నారులు ఉన్నారు. 0–1 నెలల చిన్నారులు 22,814 మంది ఉండగా, 1–3 నెలల చిన్నారులు 73,824 మంది, 3–6 నెలల చిన్నారులు 77,574 మంది జిల్లాలోఉన్నారు. అయితే ఇందులో రక్తహీనతతో వేలాది మంది చిన్నారులు బాధపడుతున్నారు. పౌష్టికాహారం పేదరికంపై పడగవిప్పి నాట్యం చేస్తోంది. అనేక సంక్షేమ పథకాలు ఉన్నా పిల్లలకు పూర్తి స్థాయిలో అందలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సాధారణ చిన్నారుల కంటే కూడా లోపంతో ఉన్న చిన్నారులకు అధికంగా ఇస్తున్నామని సంబంధిత శాఖలు చెబుతున్నా వాస్తవ పరిస్థితిలో చిన్నారుల ఎదుగుదల అంతంత మాత్రంగా ఉండడం ఆందోళన కలిగించే పరిణామం. చిన్నారులను శాసిస్తున్న మరణం జిల్లాలో పౌష్టికాహార లోపం జబ్బుకు గురిచేస్తే...ఆ వ్యాధి కాస్త చిన్నారులను బలి తీసుకుంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారిని కాపాడలేకపోతున్నారు. హంగు, ఆర్భాటాలకు లక్షలాది రూపాయలు తగలేస్తున్నా కళ్లెదుటే సరైన ఆహారం లేక తనువు చాలిస్తున్న చిన్నారుల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రధానంగా జిల్లా యంత్రాంగం చిన్నారుల మరణాలపై కూడా ›ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. బాలలకు అందించాల్సిన పౌష్టికాహార విషయంలో రాజీలేని ధోరణి అవలంబించి చిన్నారుల ప్రాణాలు కాపాడటానికి నడుం బిగించాలి. ప్రతినెల పదుల సంఖ్యలో రక్తహీనత చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న వైనం తలుచుకుంటూనే కన్నీళ్లు ఆగని పరిస్థితి. తల్లిదండ్రులు ఆలోచించాలి బిడ్డలు చదువులోగానీ, ఆటపాటల్లోగానీ వెనుకబడి పోవాలని కోరుకోరు. కానీ వాళ్లలో నిరుత్సాహాన్ని నింపి.. వారు వెనుకబడిపోయేలా చేసేది పౌష్టికాహార లోపం. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తల్లిదండ్రులు ప్రణాళిక రూపొందించుకోవాలి. బిడ్డ ఉత్సాహంగా లేకపోవడం... ఇతర అనేక కారణాలతో సన్నగిల్లిపోతుండడంపై కూడా తల్లిదండ్రులు ఆలోచించాలి. రక్తహీనత అన్న అనుమానం రాగానే సత్వరమే వైద్యులను సంప్రదించి అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతోపాటు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించేలా చూడాలి. తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు చిన్నారుల పౌష్టికాహార విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, పౌష్టికాహార లోపంతో ఉన్న చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారం కాకుండా అదనంగా ప్రతిరోజు గుడ్డు, 100 ఎంఎల్ పాలను కూడా అందిస్తున్నట్లు ఐసీడీఎస్‌శాఖ పేర్కొంటోంది. ఏడు వేల మందికిపైగాచిన్నారులకు రక్తహీనత జిల్లాలో రక్తహీనత చిన్నారులను పట్టిపీడిస్తోంది. ఎన్నో సమస్యలు...మరెన్నో కష్టాలతో కుటుంబాలను సాగదీస్తున్న అనేక మంది చిన్నారుల విషయంలో చేతనైనంత ఆహారాన్ని అందిస్తున్నా కానీ ఎక్కడో ఒకచోట లోపం కనిపిస్తోంది. ఎన్ని రకాలుగా కన్న బిడ్డలను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నా పౌష్టికాహార లోపం మాత్రం వారిని ఎదగనీయడం లేదు. జిల్లాలో తీవ్ర లోపంతో అల్లాడుతున్న చిన్నారులు 1849 మంది ఉన్నారు. అందులో చాలామందికి సీహెచ్‌సీలు, రిమ్స్, పీహెచ్సీలలో వైద్య సేవలు అందిస్తూ ఎదగడానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. 24 గంటలు వారిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా సాధారణ పౌష్టికాహార లోపంతో మరో 5341 మంది బాధపడుతున్నారు. రక్తహీనత లక్షణాలు ♦ వయస్సుకు తగ్గ బరువు మరియు పొడవు ఉండకపోవడం ♦ బలహీనంగా ఉండడం... తరుచూ అనారోగ్యానికి గురికావడం ♦ ఎల్లప్పుడూ నీరసంగా ఉండడంతోపాటు చురుగ్గా ఉండకపోవడం ♦ బిడ్డ అభివృద్ధి దశలో ఎదుగుదల లేకపోవడం -
ముగ్గురు పసికందులు మృతి
హిందూపురం అర్బన్: హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ముగ్గురు పసికందులు మృతి చెందటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 18న మడకశిర మండల పాపసానిపల్లికి చెందిన కవిత తన నాలుగు నెలల ఆడ శిశువుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యసేవలు పొందుతున్న పసిబిడ్డ బుధవారం ఉదయం చనిపోయింది. ప్రాణం పోస్తారని బిడ్డను తీసుకువస్తే బిడ్డ శవాన్ని చేతికిచ్చారని కవిత కన్నీరుమున్నీరైంది. ♦ ఇలా ఉండగానే గంట తర్వాత చౌళూరు గ్రామానికి చెందిన సుకన్య మూడునెలల ఆడశిశువుకు దగ్గు ఉందని, సరిగా పాలు తాగలేకపోతోందని ఆస్పత్రిలో చేర్చింది. చికిత్స పొందుతూ పాప 10 గంటల సమయంలో మృతి చెందింది. అక్కడి సిబ్బంది విషయం తెలిస్తే రచ్చ అవుతుందని భావించి పాప బతకదని ముందే చెప్పామని చెప్పి బాధితులను ఆటో ఎక్కించి పంపించేశారు. ♦ మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిసలమానేపల్లికి చెందిన శ్రావణి రెండు నెలల మగశిశువు ఆరోగ్యం బాగలేదని ఆస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యుల సూచన మేరకురక్త పరీక్షలు చేయించి తీసుకొచ్చిన కొద్దిసేపటికే బిడ్డ శీరీరం చల్లబడిపోయింది. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు చెప్పారు. దీంతో తల్లి శ్రావణి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో లేపాక్షి పీహెచ్సీ ఆస్పత్రిలో చేర్పించారు. పేరుకే జిల్లా ప్రభుత్వాస్పత్రి హిందూపురంలో రూ.23 కోట్లు వెచ్చించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి ఏ మాత్రం తీసిపోని రీతిలో హంగు అర్భాటంతో ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు, సదుపాయాలు కల్పించారు. అయితే ఇక్కడ వైద్యం అందించడానికి వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. పేరుకే జిల్లా ఆస్పత్రి. సేవల్లో పీహెచ్సీ కన్నా అధ్వానంగా మారిందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైద్యసేవలపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెబితే ‘ఇక్కడ పదిమంది లేరు.. వచ్చి చూస్తారు.. కాస్త ఓపిక ఉండాలి’ అంటూ చీదరించుకుంటున్నారని తెలిపారు. వైద్యులు వచ్చి చూసేసరికి ఉన్న ప్రాణం పోయే పరిస్థితి నెలకొంటోందన్నారు. విచారణకు కలెక్టర్ ఆదేశం అనంతపురం న్యూసిటీ: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న పసికందుల మరణాలపై కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. జేసీ–2 సుబ్బరాజు, డీఎంఅండ్‌హెచ్‌ఓ అనీల్‌కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్‌తో కమిటీగా వేశారు. కమిటీ రెండు రోజుల్లోపు లోతుగా ఆరా తీసి నివేదిక ఇవ్వాలని సూచించారు. చిన్నారుల మృతి పట్ల కల్టెకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్నీ సహజ మరణాలే ఒకేరోజు ముగ్గురు పసికందులు చనిపోయారు. అన్నీ సహజ మరణాలే. పాపసానిపల్లి కవితకు మేనమామతో పెళ్లయ్యింది. మేనరికం వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతిని చనిపోయింది. చౌళూరు సుకన్య బిడ్డ కుపోషణకు గురై చనిపోయింది. బిసలమానేపల్లి శ్రావణి బిడ్డకు రక్తం తక్కువగా ఉండటంతో మృతి చెందింది.– డాక్టర్ కేశవులు, సూపరింటెండెంట్, హిందూపురం ప్రభుత్వాస్పత్రి వైద్యసేవల్లో నిర్లక్ష్యం లేదు హిందూపురం ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న మరణాలపై వైద్యశాఖ నిర్లక్ష్యం లేదు. కేసులన్నీ చివరిలో ఆస్పత్రికి వచ్చాయి. ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యమే అందించారు. –రమేశ్‌నాథ్, డీసీహెచ్ఎస్ -
తల్లి గర్భంలో చావుగంట!
కోడుమూరులో మూడేళ్ల క్రితం ఓ నర్సింగ్ హోమ్‌పై అధికారులు దాడులు నిర్వహించి లింగనిర్ధారణ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ తర్వాత స్కానింగ్ యంత్రాన్ని సీజ్ చేశారు. కానీ ఆ మిషన్ పక్కనే మరో మిషన్‌ను అనధికారికంగా తెచ్చుకుని అక్కడి వైద్యులు స్కానింగ్ చేస్తూ ఆపై అబార్షన్లు చేస్తున్నారు. కర్నూలు ఎన్ఆర్ పేటలోని ఓ స్కానింగ్ కేంద్రంలోనే ఓ మహిళా వైద్యురాలు ఇదే విధంగా అనధికార స్కానింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రస్తుతం అధికారికంగా 230కి పైగా స్కానింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అనధికారికంగా 450కి పైగా నడుస్తున్నాయని అంచనా. అనుమతి తీసుకున్న కేంద్రాల కంటే అనుమతి లేని కేంద్రాల్లోనే లింగనిర్ధారణ అధికంగా జరుగుతోంది. కర్నూలు కొత్తబస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్ఆర్ పేట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పలు క్లినిక్‌లు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, డోన్, నంద్యాల, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే చాలు అధిక శాతం అబార్షన్‌కు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాల సమ్మతి మేరకు జరుగుతున్న ఈ తంతులో అటు గర్భిణి కుటుంబసభ్యులు, ఇటు వైద్యవర్గాలు విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇద్దరికీ శిక్ష పడుతుందని భావించి గుట్టుగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నారు. తగ్గుతున్న స్త్రీ, పురుషుల నిష్పత్తి.. జిల్లాలో పురుషులు, మహిళల నిష్పత్తిలోభారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. 1000 మంది పురుషులకు ప్రస్తుతం జిల్లాలో 932 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం డోన్‌లో 889, ప్యాపిలిలో 894, గడివేములలో 899, శ్రీశైలంలో 892 మాత్రమే స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో పాటు ఆదోని డివిజన్‌లోనూ 1000 మంది పురుషులకు అధిక శాతం మండలాల్లో 900 నుంచి 910లోపే స్త్రీలు ఉన్నారు. దీన్ని బట్టి జిల్లాలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోంది. ఆర్ఎంపీలకు భారీగా కమీషన్లు స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రధాన పాత్ర వహించేది ఆర్‌ఎంపీలేనన్న విషయం బహిరంగ రహస్యం. ఏ మాత్రం పేరులేని ఈ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయంటే ఆర్ఎంపీలకు వారు ఇస్తున్న భారీ కమీషన్లే కారణంగా చెప్పుకోవచ్చు. అధికంగా ఆదోని, తెలంగాణ రాష్ట్రంలోని పలు మండలాల నుంచి నిరక్షరాస్యులైన గర్భిణిలకు మాయమాటలు చెప్పి ఆర్ఎంపీలు కర్నూలుకు తీసుకొస్తున్నారు. ఈ మేరకు లింగనిర్ధారణకు స్కానింగ్ చేయించడానికి గర్భిణిని తీసుకొస్తే రూ.4వేల నుంచి రూ.6వేలను వైద్యులు వసూలు చేస్తారు. అందులో ఆర్ఎంపీ కమీషన్ రూ.2000 ముట్టచెబుతున్నారు. పీసీపీఎన్డీటీ చట్టం అంటే లెక్కేలేదు వరకట్న చట్టం, ధూమపాన నిషేధ చట్లాల్లాగే జిల్లాలో లింగనిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ పీఎన్డీటీ చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ఉన్నట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు అతికించి, లోపల మాత్రం యదేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ చట్టం ఏర్పడి పాతికేళ్లు అవుతోంది. దీనిని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు కాలేదు. ఒక్కరు కూడా జైలు గడప కాదు కదా కోర్టు మెట్లు కూడా ఎక్కలేదు. దీన్ని బట్టి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ శాఖలో లెప్రసి కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి గతంలో పీసీపీఎన్డీటీ యాక్ట్ బాధ్యతలు చూసేవారు. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆయనను లెప్రసి కార్యాలయానికి పంపించారు. ఏమైందో ఏమో మళ్లీ ఆయనను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి తెచ్చుకున్నారు. దాడులు ముమ్మరం చేస్తాంజిల్లాలో లింగనిర్ధారణ, భ్రూణహత్యల (అబార్షన్లు)పై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. త్వరలో స్కానింగ్ సెంటర్లు, క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులపై మూకుమ్మడి దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. – డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డీఎంహెచ్‌వో -
ఈ పాపం ఎవరిది?
నెల్లూరు, పొదలకూరు: అసలే పేదరికం. భార్యాభర్తలు దివ్యాంగులు. ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చారు. నాలుగో సంతానం మగబిడ్డ కావాలనుకుని గర్భం దాల్చడమే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఏడో నెలలో పౌష్టికాహార లోపం వల్ల బిడ్డ కడుపులోనే మృతి చెందగా, తల్లి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో ముగ్గురు ఆడ పిల్లలు దిక్కులేని వారయ్యారు. ప్రభుత్వం గర్భిణి, బాలింత, పురిటి బిడ్డలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా ఆదుకుంటున్నామని, శిశు మరణాలను గణనీయంగా తగ్గిస్తున్నామని ఊదరగొట్టుకుంటోంది. స్త్రీ, శిశు మరణం నెలకొన్నా ఒక్క అధికారి సైతం అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆకలితో అలమటిస్తూ.. ఏ పాపం చేశారో ఏమో ఆ చిన్నారులు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. పొదలకూరు ఏసీనగర్ కాలనీలో కొంగి వెంకటేశ్వర్లు, వెంకటరమణమ్మ ముగ్గురు ఆడబిడ్డల పరిస్థితి ఘోరంగా ఉంది. తల్లిదండ్రులు దివ్యాంగులు (తండ్రి అంధుడు, తల్లికి అంగవైకల్యం). ఈ నేపథ్యంలో గర్భిణిని గుర్తించి పౌష్టికాహారం అందించాల్సిన ఐసీడీఎస్, వైద్యపరీక్షలు చేయించాల్సిన వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది వద్ద కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. కాలనీవాసులు ద్వారా సమాచారం తెలుసుకున్నా అధికారులు అటు కేసి వెళ్లకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి ఎలాగో పోయినా ఉన్న బిడ్డలకు తండ్రి పట్టెడన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. పిల్లలను చైల్డ్‌కేర్ సెంటర్‌కు తరలించాలి దిక్కులేని ముగ్గురు ఆడపిల్లలను అధికారులు చొరవ తీసుకుని చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించాల్సిందిగా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ముగ్గురు ఆడపిల్లల్లో దివ్య(11), శ్రావ్య(8) దివ్యాంగులు. సుమతి(4) స్థానిక అంగన్వాడీ కేంద్రంకు వెళుతోంది. తండ్రి పుట్టు అంధుడు కావడంతో ఆడ పిల్లలను చూసుకునే పరిస్థితి లేదంటున్నారు. మృతి చెందిన భార్య వెంకటరణమ్మకు దశదిన కర్మ చేసేందుకు సైతం స్తోమత లేదని కాలనీవాసులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున అధికారులు స్పందించి చేయూత నివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐసీడీఎస్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.