బిహార్‌లో మెదడువాపు వ్యాధితో 160 మందికి పైగా చిన్నారులు మరణించిన ఉదంతంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. చిన్నారుల మృతులపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బిహార్, యూపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగే నోటీసులకు బదులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.