![Child Deaths In East Godavari Agency Area - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/6/sisu-maranam.jpg.webp?itok=cmEFBx-E)
తల్లి ఒడిలోనే కన్నుమూసిన చిన్నారి
మన్యంలో కన్నతల్లుల గర్భశోకం కొనసాగుతుంది. ఘటన జరిగిన సమయంలో అధికారులు చేసిన హడావుడి ...ఇచ్చిన హామీలు చేతల్లో కానరాకపోవడంతో కన్ను తెరవకముందు కొందరు...కన్ను తెరిచిన కొద్ది రోజులకు మరికొందరు కన్నుమూస్తున్నారు.
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరో పసిపాప శనివారం మృతి చెందింది. అడ్డతీగల మండలం వంగలమడుగు గ్రామానికి చెందిన మడకం దొరబాబు, వెంకటలక్ష్మి దంపతుల రెండో బిడ్డ అయిన ఐదు నెలల పాప అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను అడ్డతీగల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108లో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆ పాప మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment