చిన్న పిల్లల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : చిన్న పిల్లల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ... వేల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం గొప్పలు చెబుతుందని విమర్శించారు.
చిన్న పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా... ఈ ప్రభుత్వానికి మాత్రం పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా శిశుమరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గతరెండేళ్లుగా మృతి చెందిన చిన్న పిల్లల గణాంకాలను ఈ సందర్భంగా సభలో వైఎస్ జగన్ వివరించారు.