మృత్యు ఘోష.. 52 మంది చిన్నారుల మృతి
జంషెడ్‌పూర్: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే మరో ఘోర కలి వెలుగు చూసింది. జార్ఖండ్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 52 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.
జంషెడ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో 52 మంది పిల్లలు చనిపోయినట్లు తెలుస్తోంది. చిన్నారుల మరణాలు ధృవీకరించిన ఆస్ప్రతి సూపరిండెంట్ పౌష్టికాహార లోపంతోనే వారంతా మరణించినట్లు చెబుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.