
కోటా (రాజస్తాన్): రాజస్థాన్‌లోని కోటాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జేకే లోన్ ఆస్పత్రిలో 107 మంది చిన్నారుల మరణాలపై ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ విమర్శించారు. చిన్నారుల మరణం చాలా బాధించిందని, దీనికి ఎవరో ఒకరు జవాబుదారీతనం వహించాలని వ్యాఖ్యానించారు. శిశువుల మరణాలపై ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదన్నారు. ఈ విషయంపై తాము మరింత సున్నితంగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. పిల్లలను కోల్పోయిన కుటుంబాలను పైలట్ శనివారం పరామర్శించి ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనపై తాము మరింత బాధ్యతగా ఉండాలి, ఆ తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment