
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు వెనుక కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందడంతో వైద్యులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నెల రోజులుగా కలవరపెడుతున్న ఈ శిశు మరణాల్లో మృతి చెందిన శిశువులంతా నాలుగు నెలలలోపు చిన్నారులే. ఆసుపత్రిలో చేరిన చిన్నారులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగానే వారి ఊపిరి ఆగిపోతోంది. దీని వెనుక కారణాలు ఏమిటనేది వైద్యులకు అంతుచిక్కడం లేదు. వరుసగా జరుగుతున్న శిశు మరణాల గురించి వైద్యులు రాష్ట్ర అధికారులకు సమాచారమిచ్చారు.
ఇది కూడా చదవండి: జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం