Kamareddy Area Hospital
-
బాన్సువాడ దవాఖాన సరికొత్త రికార్డు.. ఒకే నెలలో 504 ప్రసవాలు
కామారెడ్డి: బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో అగస్టులో 504 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లవుతోందన్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు జరిగాయన్నారు. వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వైద్యులు సుధ, సిబ్బంది ఉన్నారు. -
కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో శిశు మరణాలు వెనుక కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందడంతో వైద్యులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా కలవరపెడుతున్న ఈ శిశు మరణాల్లో మృతి చెందిన శిశువులంతా నాలుగు నెలలలోపు చిన్నారులే. ఆసుపత్రిలో చేరిన చిన్నారులకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగానే వారి ఊపిరి ఆగిపోతోంది. దీని వెనుక కారణాలు ఏమిటనేది వైద్యులకు అంతుచిక్కడం లేదు. వరుసగా జరుగుతున్న శిశు మరణాల గురించి వైద్యులు రాష్ట్ర అధికారులకు సమాచారమిచ్చారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం -
ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..
సాక్షి, నిడమనూరు(నాగార్జునసాగర్)/సదాశివనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో నిడమనూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. నిడమనూరు మాజీ సర్పంచ్ విరిగినేని అంజయ్య చెల్లెలు నంబూరి రమాదేవి(రమణ) కూతురు, అల్లుడు దగ్గర హైదరాబాద్‌లో ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున తమ కూతురు సునీత, కుమారుడు రఘురామ్, అల్లుడు రాకేష్‌లతో కలిసి మనవడు అభిషేక్‌కు అక్షరాభ్యాసం కోసం బాసరకు కారులో వెళ్తున్నారు. కామారెడ్డి సమీపంలో కారు అదుపు తప్పి నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో రమాదేవి(50), ఆమె కూతురు సునీత(30), కుమారుడు రఘురామ్(28) అక్కడిక్కడే మృతి చెందాడు. ఆమె అల్లుడు రాకేష్, మనుమడు అభిరామ్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ అభిరామ్ మృతి చెందాడు. రమాదేవిని గుంటూరు జిల్లా కనిగిరికి చెందిన నంబూరి మణికి ఇచ్చి వివాహం జరిపించారు. తర్వాత వారు అక్కడ ఇల్లు అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో రవాణా రంగంలో వివిధ వ్యాపారాలు నిర్వహించేవారు. మణి మూడేళ్ల క్రితం మృతి చెందాడు. భర్త మృతితో రమాదేవి కూతురు, అల్లుడు వద్ద హైదరాబాద్‌లో ఉంటున్నారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన వారి మృతదేహాలను విరిగినేని అంజయ్య, ఆయన సోదరుడు ఆదినారాయణలు తమ స్వగ్రామమైన నిడమనూరుకు తరలించారు. ఇటీవలనే వారి చిన్న సోదరుడు నర్సింహారావు ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం ఇంతలోనే ఇలా సోదరి కుటుంబం దూరం కావడం పట్ల వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మృతదేహాలను బుధవారం సాయంత్రం 7గంటలకు నిడమనూరుకు చేర్చారు. బాలుడు అభిరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం కోసం ఉంచారని, రాత్రి వరకు చేరుకోవచ్చని వారు తెలిపారు. మిన్నంటిన రోదనలు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో బంధువుల రోదనలతో ప్రదేశం మిన్నంటింది. వారి రోదనలు చూసిన గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తుంటే అందరినీ తీసుకెళ్లావా సరస్వతమ్మ అంటూ బంధువులు రోదించారు. అక్కడ వరుసగా ఉన్న మృతదేహాలను చూసినవారు కన్నీటిని ఆపుకోలేకపోయారు. మండల కేంద్రంలో మూడో కుటుంబం..ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ కారణాల వల్ల మృ త్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. నంబూరి రమాదేవి కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. మండల కేంద్రానికి చెందిన పాల్వాయి నారాయణ లలిత దంపతులు 15 సంవత్సరాల క్రితం ఇంటిలో నిద్రిస్తుండగా మిదె కూలి మృతి చెందారు. వారి ఇద్దరికీ ఒకే సారి అంత్యక్రియలు నిర్వహించారు. అది అప్పట్లో సంచలనంగా మారింది. ఐదు సంవత్సరాల క్రితం వ్యవసాయశాఖలో పని చేసి రిటైర్ అయిన గుండెమెడ సంగీత రావు సతీ మణి స్వరాజ్యం వారి కుమారుడు, హోంగార్డుగా పని చేస్తున్న గుండెమెడ బా బ్జీలు ఒక్క రోజు తేడాతో అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతదేహా లను పక్కపక్కనే పెట్టి తర్వాత ఒకే సారి అంత్యక్రియలు చేశారు. రమాదేవి కటుంబం మాదిరిగానే ఒకే కుటుంబానికి చెందిన వారు గతంలో మృతి చెందిన సంఘటనలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. సాక్షి, సదాశివనగర్: హైదరాబాద్‌లోని వనస్థలిపురం హైకోర్టు కాలనీకి చెందిన నాగాల సునీత(31), రాకేష్‌లకు రెండున్నరేళ్ల కుమారుడు నాగాల అభిరాం ఉన్నాడు. రాకేశ్ స్వస్థలం గుంటూరు కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. సునీత రాకేష్ దంపతులు తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకుని, గురువారం తెల్లవారుజామున మిర్యాలగూడకు చెందిన అత్త నంబూరి రమాదేవి (50), బావమరిది నంబూరి రఘురాం (33)లతో రాకేష్ కుటుంబం కారులో నిర్మల్ జిల్లాలోని బాసరకు బయలుదేరింది. రఘురాం కారు నడిపిస్తున్నారు. వీరి వాహనం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామశివారు ప్రాంతానికి రాగానే డ్రైవింగ్ చేస్తున్న రఘురామ్‌కు నిద్ర ముంచుకువచ్చింది. దీంతో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలివైపు రహదారిపైకి వెళ్లింది. అదే సమయంలో నిజామాబాద్ వైపునుంచి కామారెడ్డి వైపు ఎరువుల లోడ్‌తో వెళ్తున్న లారీ కిందకు వీరి కారు దూసుకెళ్లింది. కారు వేగానికి లారీ డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. మంటలతోనే 50 మీటర్ల దూరం వరకు వెళ్లి లారీ ఆగిపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. దీంతో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈప్రమాదంలో నంబూరి రమాదేవి కారులో నుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికి లారీ కింద ఇరుక్కుపోవడంతో నంబూరి రఘురాం, నాగాల సునీత తలలు పగిలి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ ఆయన కుమారుడు అభిరాంలను గ్రేహౌండ్స్ పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌లో హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అభిరాం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై నరేశ్ తెలిపారు. కొంపముంచిన నిద్రమత్తు! ఈ ప్రమాదంలో వేగంతో ఉన్న కారు ముందు టైర్ రోడ్డు డివైడర్ ఎక్కగానే గమనించి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు. కారు డ్రైవర్ డివైడర్ ఎక్కిన విషయాన్ని గమనించకపోవడానికి నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు. -
ధాన్యం కుప్పలపైనే రైతు కన్నుమూత
ఐదు రోజులుగా ధాన్యానికి కాపలా... దోమకొండ(కామారెడ్డి): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి, ధాన్యం కుప్ప కు కాపలాగా ఉన్న ఓ రైతు అక్కడే మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల పోచయ్య (62) ఈనెల 11న 30 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అక్కడ రవాణా సమస్యతో ధాన్యం తూకాలు వేగంగా సాగడం లేదు. దీంతో రైతులు రోజుల తరబడి కాంటా కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆకుల పోచయ్య ఐదు రోజులుగా తన ధాన్యానికి కాపలా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం వరకు పొలం వద్ద పనులు చేసిన పోచయ్య.. రాత్రి భోజనం చేసి వెళ్లి.. ధాన్యం వద్ద కాపలాగా పడుకున్నాడు. మంగళవారం వేకువజామున తోటి రైతులు లేపడానికి ప్రయత్నించగా, అప్పటికే చనిపోయి ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బకు గురై మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు పసికందుల మృతి
వైద్యుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆందోళన కామారెడ్డి క్రైం (కామారెడ్డి): కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో బుధవారం అప్పుడే పుట్టిన ఇద్దరు పసికందులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వారి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగగా, పోలీసులు వచ్చి సముదాయించారు. కామారెడ్డి మండలం సరంపల్లికి చెందిన కొత్తూరి పెద్దబాపురాజు భార్య మణెమ్మ బుధవారం ఉదయం మూడో కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆమె కడుపులో కవలలున్నట్లు వైద్యులు నిర్ధారించగా, ఉదయం 9.45 గంటలకు ఆడశిశువుకు జన్మనిచ్చింది. మధ్యాహ్నం 1 గంట వరకు రెండో శిశువు సాధారణ డెలీవరీ కోసం వైద్యులు ప్రయత్నించారు. తర్వాత ఆపరేషన్ చేశారు. అప్పటికే కడుపులో శిశువు మృతి చెందింది. వైద్యులు ఆలస్యం చేయడంతోనే శిశువు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. కాగా, ఆస్పత్రికి మంగళవారం రాత్రి భిక్కనూర్‌కు చెందిన గొండ్ల నవీన్ తన భార్య శిరీషను మొదటి డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సాధారణ డెలివరీ కాగా, పుట్టిన మగశిశువుకు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డెలివరీ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు పరిస్థితి విషమంగా మారిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న శీరీష కుమారుడిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయాడు. దీంతో వారి బంధువులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు గంటలపాటు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. -
శవాల విందు !
కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో శవాలకూ రక్షణ లేకుండా పోయింది. ప్రమాదంలో మరణించినా.. ఆత్మహత్యల కేసుల్లోనూ.. రోగులు మృతి చెందినా.. పోస్టు మార్టం మరుసటి రోజుకు వాయిదా పడిం దంటే చాలు.. శవం మార్చురీ గదికి వెళ్లిందో.. అక్కడ పందికొక్కులు రెడీగా ఉంటాయి పీక్కు తినడానికి .. ఈ వేదనా భరిత దుస్థితికి మృతుల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందికొక్కులే అతిథి దేవుళ్లు వేదిక : కామారెడ్డి ఏరియా ఆస్పత్రి, మార్చురీ గది కామారెడ్డి :రోగులే కాదు.. శవాలు కూడా ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేంతటి దుస్థితి నెలకొంది కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ! రోగుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు చివరకు శవాల విషయంలోనూ అంతకన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో వృతిచెందిన ఒక వ్యక్తి శవాన్ని పోస్టుమార్టం గదిలో పందికొక్కులు, ఎలుకలు పీక్కుతిన్న ఘటనే నిదర్శనం. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న ఏరియా ఆస్పత్రిలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కామారెడ్డి మీదుగా జాతీయరహదారి, రైల్వేబ్రాడ్గేజ్ లైన్‌తో పాటు రాష్ట్రీయ రహదారులు వెళతాయి. దీంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతుంటాయి. దానికి తోడు ఆత్మహత్యలు, హత్యల కేసులూ ఎక్కువే. ప్రమాదాల్లోగాని, ఆత్మహత్యలు, హత్య ఘటనల్లో గాని చనిపోయిన వారి శవాలను ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తారు. రోజుకూ ఒకటి, రెండు శవాలు వస్తూనే ఉంటాయి. సూర్యాస్తమయం తరువాత వచ్చే శవాలను పోస్టుమార్టం గదిలో పడేస్తారు. తెల్లవారి ఆస్పత్రికి వైద్యులు వచ్చి, పోలీసుల పంచనామా ప్రక్రియలు ముగిసిన తరువాత పోస్టుమార్టం ప్రక్రియ మొదలవుతుంది. అయితే పోస్టుమార్టం గది నిర్వహణ విషయంలో ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పందికొక్కులు, ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. పోస్టుమార్టం గదిలో ఉంచిన శవాలను కొరుక్కుతింటుండడంతో చనిపోయిన వారి కుటుంబాల వారు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమవారి ఆఖరిచూపులోనైనా వారి ముఖం చూసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి ముఖం చెదిరిపోకుండా ఉండింది. కాని పోస్టుమార్టం గదిలో తెల్లారేసరికి మొఖంపై ఉన్న చర్మాన్ని పందికొక్కులు, ఎలుకలు పీక్కుతిన్నాయి. వైద్యం కోసం వచ్చేవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు శవాల విషయంలోనూ అంతకన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఆస్పత్రి నిర్వహణకు వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల బడ్జెట్ వస్తున్నా ఆస్పత్రి ప్రధాన అధికారులు వసతుల కల్పన విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. పోస్టుమార్టం గదిలో ఫ్రీజర్లు లేవు.... గుర్తుతెలియని వృతదేహాలను భద్రపరిచేందుకు ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో ఎలాంటి ఫ్రీజర్లు లేవు. ఒక్కోసారి శవాలను నాలుగైదు రోజులు భద్రపర్చాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రిలో ఫ్రీజర్ల ఏర్పాటు విషయంలో అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. పోస్టుమార్టం గది చిన్నగా ఉండడం వల్ల ఒక్కోసారి నాలుగైదు శవాలు వస్తే వాటిని కింద పడేస్తున్నారు. పశువుల వృతదేహాల కన్నా నిర్లక్ష్యంగా శవాలను పడేస్తుండడం ఆత్మీయులను కంటతడి పెట్టిస్తోంది. ఏటా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు శవాలు పోస్టుమార్టం గదికి వస్తుంటాయి. మనుషులను పట్టించుకోని అధికారులు కనీసం శవాలపైనైనా మానవతా దృక్పథం ప్రదర్శించాలని పలువురు కోరుతున్నారు.