
తొక్కిసలాట దురదృష్టకరం: కామినేని
గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఎక్కువ మంది భక్తులు ఒకే ఘాట్ కు రావడం వల్లే రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగై వైద్యం అందిస్తామని తెలిపారు. బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా జనాన్ని ఘాట్ వద్దకు వదలడంతో దుర్ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.