అనంతపురం: అనంతపురం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విష జ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు. మంగళవారం అనంతపురంలో డీఎం అండ్ హెచ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి కామినేని శ్రీనివాస్ను రాజీనామా చేయాలంటూ సీపీఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దాంతో డీఎం అండ్ హెచ్వో కార్యాలయం వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.