
ఢిల్లీ బయల్దేరిన మంత్రి కామినేని శ్రీనివాస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు సో్మవారం ఉదయం ఢిల్లీ బయల్దేరివెళ్లారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఈ రోజు సమావేశంకానున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ స్థాయి ఆస్పత్రిని నెలకొల్పే విషయంపై కామినేని శ్రీనివాస్ రావు కేంద్రమంత్రితో చర్చించనున్నారు.