'ఇంట్లో ఎలుకల్నే కంట్రోల్ చేయలేకపోతున్నాం' | we are not control rats in home also says ap minister kamineni | Sakshi
Sakshi News home page

'ఇంట్లో ఎలుకల్నే కంట్రోల్ చేయలేకపోతున్నాం'

Published Wed, Oct 7 2015 1:36 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

'ఇంట్లో ఎలుకల్నే కంట్రోల్ చేయలేకపోతున్నాం' - Sakshi

'ఇంట్లో ఎలుకల్నే కంట్రోల్ చేయలేకపోతున్నాం'

హైదరాబాద్: 'ఇంట్లోనే ఎలుకలు, బొద్దింకలను మనం కంట్రోల్ చేసుకోలేక పోతున్నాం. అలాంటిది ఆసుపత్రిలో ఎలుకలను అదుపు చేయడం మానవసాధ్యం కాదు' అని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గుంటూరు జీజీహెచ్ లో జరిగిన ఎలుకల ఘటనను రాష్ట్రమంతటికీ ఆపాదించవద్దన్నారు. ఆయనిక్కడ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈసీజీ ని అర్థం చేసుకోవడం ఎలా? అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ఎలుకలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నేటి నుంచి 8 జిల్లాల్లో 2 విడత ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. దీని ద్వారా చిన్నపిల్లలకు 7 రకాల వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement