గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి... పసికందు మృతి చెందడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన నలుగురు వైద్యులను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు రూరల్ మండల పరిధిలోని దాసరిపాలెంకి చెందిన జగన్నాథం నాగబాబు ఆటోడ్రైవర్. అతని భార్య భవానికి పురుటి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా ఉదయం 7.20 గంటలకు మగబిడ్డ పుట్టాడు.