ggh guntur doctors
-
గుంటూరు జీజీహెచ్‌లో మరో జీబీఎస్ మరణం
సాక్షి, గుంటూరు: ఏపీలో జీబీఎస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి మరో మహిళ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్‌లో బుధవారం షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతిచెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత పెరిగి ఇవాళ సాయంత్రం మరణించింది. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.ఇవీ లక్షణాలుమెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.⇒ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు.⇒జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.⇒శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.ఎందుకిలా? ఎవరికి వస్తుంది?ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది.ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. -
8 గంటలు శ్రమించి... ప్రాణాలు కాపాడారు జీజీహెచ్ లో అరుదైన ఆపరేషన్...!
-
గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీ
సాక్షి, గుంటూరు/గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌ను బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల అధిపతులు, వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రోగులకు అందుతున్న వైద్యం, అందుబాటులో ఉన్న వసతులపై సమీక్షించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్ వినోద్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డైరెక్టర్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాఘవేంద్ర తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ నాడు–నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి, కొత్త ఆస్పత్రుల నిర్మాణాల కోసం ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా తమ ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలలను తీసుకొస్తున్నట్టు తెలిపారు. గ్రామగ్రామానికీ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు తీసుకొస్తున్న గొప్ప ప్రభుత్వం తమదన్నారు. టెలి మెడిసిన్, నాడు–నేడు కార్యక్రమాలతో వైద్య రంగంలో ఏపీ రోల్‌మోడల్‌గా నిలుస్తోందన్నారు. మెడికల్ అడ్మినిస్ట్రేటర్ల నియామకం నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలల్లో, టీచింగ్ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. వైద్య పరికరాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెడికల్ సూపరింటెండెంట్లు వైద్య సేవలపైనే దృష్టి కేంద్రీకరించేలా.. నూతనంగా మెడికల్ అడ్మినిస్ట్రేటర్లను నియమిస్తామని, వైద్య పరికరాలు, శానిటేషన్, సెక్యూరిటీ, సివిల్, ఎలక్ట్రికల్ పనులన్నీ అడ్మినిస్ట్రేటర్లు చూస్తారని తెలిపారు. -
సూది మింగిన చిన్నారి
సాక్షి, గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ వైద్యురాలు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగేళ్ల చిన్నారి పొట్ట నుంచి సూది బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్కర్ బాబూలాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పొత్తూరు వారి తోటకు చెందిన మహ్మద్ అబెదుల్లా, సాజియా దంపతుల నాలుగేళ్ల కుమార్తె షీమా సోమవారం ఇంటి వద్ద ఆడుకుంటూ చేతికి అందిన సూదిని మింగేసింది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. కడుపులో నుంచి తీసిన సూది పీడియాట్రిక్ సర్జరీ వైద్యులు వార్డులో అడ్మిట్ చేసుకుని ఎక్స్‌రే తీసి మింగిన సూది కడుపులో పేగులకు అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ కవితకు తెలియజేశారు. డాక్టర్ కవిత మంగళవారం షీమాకు కేవలం 8 నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ చేసి కడుపులో నుంచి సూదిని బయటకు తీశారు. చిన్నారి కడుపులో ఉన్న సూది నాలుగు సెంటీమీటర్ల పొడవుందని, ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా సూదిని బయటకు తీసినట్లు డాక్టర్ కవిత వెల్లడించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్, ఇతర అధికారులు, వైద్యులు డాక్టర్ కవితకు అభినందనలు తెలిపారు. -
మంత్రి సీరియస్: నలుగురు వైద్యులపై వేటు
-
మంత్రి సీరియస్: నలుగురు వైద్యులపై వేటు
గుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి... పసికందు మృతి చెందడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన నలుగురు వైద్యులను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు రూరల్ మండల పరిధిలోని దాసరిపాలెంకి చెందిన జగన్నాథం నాగబాబు ఆటోడ్రైవర్. అతని భార్య భవానికి పురుటి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా ఉదయం 7.20 గంటలకు మగబిడ్డ పుట్టాడు. అరగంట తర్వాత బిడ్డ చనిపోయాడంటూ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా డెత్ సర్టిఫికేట్‌తో సహా వారి చేతిలో పెట్టారు. దీంతో వారు కన్నీరుమున్నీరు అవుతూ బిడ్డ మృతదేహాన్ని తీసుకుని... ఆటోలో ఇంటికి పయనమైయ్యారు. ఇంతలో పసికందులో కదలిక వచ్చింది. ఆ విషయాన్ని గుర్తించి... మళ్లీ ఆసుపత్రికి తీసుకుచ్చారు. దీంతో నాలుక్కరుచుకున్న వైద్యులు హడావుడిగా శిశువును ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు.అయితే ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పసికందు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.