'ఉ 8 గం.లకే ఆస్పత్రి ఓపీ సేవలు ప్రారంభం' | Kamineni srinivas checking in rims at ongole | Sakshi
Sakshi News home page

'ఉ 8 గం.లకే ఆస్పత్రి ఓపీ సేవలు ప్రారంభం'

Published Thu, Apr 30 2015 9:24 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

'ఉ 8 గం.లకే ఆస్పత్రి ఓపీ సేవలు ప్రారంభం' - Sakshi

'ఉ 8 గం.లకే ఆస్పత్రి ఓపీ సేవలు ప్రారంభం'

ఒంగోలు : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉదయం 8 గంటలకే ఓపీ సేవలు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని  ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఓపీ పనివేళలో మార్పునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో కామినేని బస చేసి... వార్డులను పరిశీలించారు.

ఒంగోలు రిమ్స్లో అసంపూర్తిగా ఉన్న పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే కడప, శ్రీకాకుళం రిమ్స్లలో సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. నర్సింగ్ విద్యార్థల సమస్యల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement