'ఇతర అనారోగ్యాల వల్లే ఆ మరణాలు..' | deaths for other reasons says kamineni srinivas | Sakshi
Sakshi News home page

'ఇతర అనారోగ్యాల వల్లే ఆ మరణాలు..'

Aug 5 2015 6:00 PM | Updated on Jun 13 2018 8:02 PM

'ఇతర అనారోగ్యాల వల్లే ఆ మరణాలు..' - Sakshi

'ఇతర అనారోగ్యాల వల్లే ఆ మరణాలు..'

కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో ఇటీవల చనిపోయిన వారంతా ఇతర అనారోగ్య కారణాలతోనే మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు.

చల్లపల్లి (కొత్తమాజేరు): కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో ఇటీవల చనిపోయిన వారంతా ఇతర అనారోగ్య కారణాలతోనే మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. రెండు నెలల క్రితం విష జ్వరాలతో 18 మంది చనిపోతే అప్పటి నుంచి గ్రామాన్ని సందర్శించని ఆరోగ్యశాఖ మంత్రి.. ఇపుడు సందర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసి 24 గంటలు గడవక ముందే ఆ గ్రామాన్ని మంత్రి కామినేని సందర్శించటం గమనార్హం.

అంతా అదుపులోనే ఉంది..
అనంతరం గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..  'విషజ్వరాలతో భయపడుతున్న కొత్తమాజేరు గ్రామంలో పరిస్థితి అంతా అందుపులోనే ఉంది. గ్రామంలో విషజ్వరాలు ప్రబలినప్పటి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా కలెక్టర్ ఎ.బాబు ద్వారా వివరాలను తెలుసుకుంటూనే ఉన్నాం. తద్వారా వెంటనే గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేసి గ్రామస్తులకు వైద్య సదుపాయం అందించాం. గ్రామంలో చనిపోయిన వారంతా ఇతర అనారోగ్య కారణాలతోనే చనిపోయారు. మరి కొద్దిరోజుల పాటు గ్రామంలో వైద్యశిబిరం కొనసాగించాలని అధికారులను ఆదేశించాం. మృతుల కుటుంబాలను కలవకుండా, వివరాలు తెలుసుకోకుండా సమావేశం కొనసాగినంతసేపు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు.

పత్రికల్లో చూసి తెలుసుకున్నా..
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామంలోని పరిస్థితి జూన్ 17న పత్రికల్లో చూసి తెలుసుకున్నానని, అప్పటి నుంచి ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తూ గ్రామంలో కూడా పలుమార్లు పర్యటించానని చెప్పారు. పంచాయతీలో నిధులు ఉండి తీర్మానం చేయకపోవడంపై పంచాయతీ నిర్వాహకులపై, అధికారులపై చర్యలు తీసుకుని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పైడిపాముల కృష్ణకుమారి, సర్పంచ్ మాచవరపు సునీత, డీఎంహెచ్‌వో నాగమల్లేశ్వరి, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement