
'బి' కేటగిరీ సీట్ల కోసం ఎంసెట్ ఏసీ పరీక్షలు: కామినేని
మెడికల్ కళాశాలల్లో 'బి' కేటగిరీ సీట్ల భర్తీ కోసం ఎంసెట్ ఏసీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు.
హైదరాబాద్: మెడికల్ కళాశాలల్లో 'బి' కేటగిరీ సీట్ల భర్తీ కోసం ఎంసెట్ ఏసీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. మే 8న ఎంసెట్, 24 న ఎంసెట్ ఏసీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. 35 శాతం సీట్లను ఎంసెట్ ఏసీ కోటా ద్వారా భర్తీ చేయడంతో 700 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరలో సుమారు 1300 డాక్టర్ పోస్టులు, 1000 నర్సింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ పై త్వరలో చర్యలు తీసుకుంటామని కామినేని శ్రీనివాస్ చెప్పారు.
మరోవైపు కుక్కలబెడద తీవ్రంగా ఉందని, జంతు ప్రేమికులు దీనిపై ఆలోచించాలన్నారు. జంతు ప్రేమికులతో ప్రభుత్వం సమావేశమై వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటుందన్నారు.