
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు విడతలుగా భేటీ అయ్యారు. కోర్ కమిటీ భేటీ తర్వాత అమిత్ షా తన ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు మురళీధర్ రావు, రాం మాధవ్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. వీరితో పాటు ఏపీకి చెందిన నేతలు పురందేశ్వరి, మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. సమావేశం తర్వాత ఓ సీనియర్ నేత అసంతృప్తితో వెళ్లిపోయారని సమాచారం. ఈ కీలక సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ ను పార్టీ హైకమాండ్ ఆహ్వానించకుండా దూరంగా ఉంచింది. దీంతో ఏపీ బీజేపీలో అసంతృప్తి రాగం అందుకున్నట్లు పరిస్థితి తయారయింది.