'రేవంత్రెడ్డి చర్య ప్రోత్సహించేది కాదు' | Kamineni srinivas takes on trs party | Sakshi
Sakshi News home page

'రేవంత్రెడ్డి చర్య ప్రోత్సహించేది కాదు'

Published Thu, Jun 4 2015 12:35 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

'రేవంత్రెడ్డి చర్య ప్రోత్సహించేది కాదు' - Sakshi

'రేవంత్రెడ్డి చర్య ప్రోత్సహించేది కాదు'

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. గురువారం హైదరాబాద్లో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ... టీ టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత రేవంత్రెడ్డి చర్య ప్రోత్సహించేది కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలని ఆయన నేతలకు హితవు పలికారు. డబ్బు కోసం రాజకీయాలను వాడుకోవద్దంటూ నేతలకు సూచించారు.

రేవంత్ విషయంలో ఏసీబీని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. రేవంత్ వ్యవహారంలో ఏసీబీ వాళ్లు ఫుటేజ్ను రిలీజ్ చేయకుండానే మీడియాకు సదరు వీడియో ఎలా లీకయిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు సీట్లు టీఆర్ఎస్కు ఎలా వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓ పార్టీలో గెలిచిన నేతలు మరో పార్టీలోకి ఎలా వెళ్లారని కామినేని శ్రీనివాస్ ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement