భీమవరంలో కేంద్ర, రాష్ట్రమంత్రుల స్వచ్ఛభారత్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. భీమవరం డీఎన్ఆర్ కాలేజిలో ఆయన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన భీమవరం ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో అసలు సరైన సౌకర్యాలే లేవని స్థానికులు కామినేని శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలను మెరుగు పరుస్తామని, దీన్ని వంద పడకల ఆస్పత్రిగా కూడా మారుస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు.