DNR College
-
భీమవరంలో కేంద్ర, రాష్ట్రమంత్రుల స్వచ్ఛభారత్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. భీమవరం డీఎన్ఆర్ కాలేజిలో ఆయన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన భీమవరం ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో అసలు సరైన సౌకర్యాలే లేవని స్థానికులు కామినేని శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలను మెరుగు పరుస్తామని, దీన్ని వంద పడకల ఆస్పత్రిగా కూడా మారుస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు. -
‘సోలార్’ వైపు.. మనోళ్ల చూపు
ఏలూరు : సౌర విద్యుత్ ఉత్పత్తిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు, భీమవరంలో విష్ణు, డీఎన్నార్ వంటి విద్యాసంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్‌లను నెలకొల్పి సొంత అవసరాలకు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నార. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇందుకు జిల్లాలో పెద్దఎత్తున ఉన్న కాలువలను ఉపయోగించుకోవడం ద్వారా స్థల సమస్యను అధిగమించే యోచనలో ఉన్నారు. ప్రయోగాత్మకంగా లోసరి కెనాల్‌పై సోలార్ ఫలకాలను అమర్చడం ద్వారా 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇది ఎలా చేయూలనే విషయమై గుజరాత్‌లోని బరోడా ప్రాం తాన్ని సందర్శించారు. అక్కడి కాలువలపై సోలార్ ఫలకాలను అమర్చి విద్యుత్ ఉత్పిత్తి చేస్తున్న తీరును అధ్యయనం చేసివచ్చారు. సోలార్ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే రాష్ట్రాలకు అందుకయ్యే ఖర్చులో 30 శాతాన్ని సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ఈ నేపథ్యంలో భీమవరం నియోజకవర్గ పరిధిలో విస్తరించివున్న లోసరి కాలువపై 15 కిలోమీటర్ల మేర సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేయూలని ఇరిగేషన్, నెడ్‌క్యాప్ అధికారులు నిర్ణరుుంచారు. ఇందుకు రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి రూ.7 కోట్లు ఒక మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరాల కోసం రూ.7 కోట్ల వరకూ అవసరం అవుతుందని అంచనా. లోసరి కాలువపై ఏర్పాటు చేసే ఫలకాల నుంచి 25 ఏళ్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడానికి వీలుంటుంది. కేంద్రం ఇచ్చే 30 శాతం సబ్సిడీపోగా మిగిలిన 70 శాతం పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉం టుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నిధులొస్తాయూ, రావా అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నారుు. ఈ దృష్ట్యా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చలు సాగుతున్నారుు. లోసరి కాలువపై ఫలకాల ఏర్పాటు, తదితర పనుల కోసం 10 నెలలు సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. గుజరాత్ వెళ్లొచ్చిన అధికారులు గుజరాత్లో సౌర విద్యుత్ ఉత్పాదన ప్రక్రియను పరిశీలించేందుకు 10 రోజుల క్రితం సర్థార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ చీఫ్ ఇంజినీర్ యూసీ జైన్, ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ డోల తిరుమలరావు, నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ డీవీ ప్రసాద్‌లతో కూడిన బృందం ఆ రాష్ట్రంలో పర్యటించి వచ్చింది. ఖాళీ స్థలాల్లోను, కాలువలపై సోలార్ యూనిట్ల ఏర్పాటు, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీ లించి వచ్చిన అధికారులు అదే పద్ధతిని ఇక్కడ అనుసరించేందుకు గల అవకాశాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే సోలార్ ఫలకాల ఏర్పాటుకు 5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. జిల్లాలో భూముల ధరల చాలా అధికంగా ఉన్నారుు. ఈ దృష్ట్యా భూమిని సమకూర్చుకోవడానికి భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కాలువలపై సౌర విద్యుత్ ఫలకాలను అమర్చుకుంటే భూమి సమస్య తీరుతుంది. అరుుతే, సోలార్ ఫలకాలను అమర్చాలంటే కాలువ వెడల్పు 16 మీటర్లు ఉండాలి. లోసరి కాలువ 15 మీటర్లు వెడల్పున ఉండటంతో దీనిపై 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు ప్రతిపాదించామని ఇరిగేషన్ ఎస్ఈ డోల తిరుమల రావు తెలిపారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసేం దుకు వీలుగా కాలువపై ఇనుప పరికరాలను అమర్చాల్సి ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ మంజూరైతే 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంటుందని ఎస్ఈ పేర్కొన్నారు. ఐదేళ్లలో పెట్టుబడి రాబట్టవచ్చు సౌర విద్యుత్ ఉత్పాదనకు పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలో తిరిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గుజరాత్లో 10 మెగావాట్ల ప్లాంట్ ద్వారా 1.6 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. దీనికి రూ.10 కోట్లు ఖర్చు పెట్టగా, తాజా పరిస్థితుల్లో ఆ ఖర్చు సగానికి పైగా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మన జిల్లాలో ఒక మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి రూ.7కోట్లు సరిపోతుందని అంచనా వేసినట్టు ఇరిగేషన్ ఎస్ఈ తెలిపారు. -
భీమవరంలో ఈ బుల్లోడి అడుగు పడితే దద్దరిల్లాల్సిందే!
‘‘ఒకప్పుడు ఇదే ప్రాంగణంలో నేను డ్యాన్స్ చేశాను. ‘వర్షం’ సినిమా వేడుక జరిగినప్పుడు ఇక్కడికి వచ్చాను. మళ్లీ ఇదే రావడం. పది సినిమాల్లో చేసే కామెడీని ఈ ఒక్క సినిమాలోనే చేశాను’’ అని సునీల్ చెప్పారు. సునీల్, ఎస్తర్ జంటగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ పాటల సీడీ ఆవిష్కరణ భీమవరంలో జరిగింది. ఈ సందర్భంగా సునీల్ ఉద్వేగంగా మాట్లాడారు. ‘వర్షంలో పిడుగు, భీమవరంలో ఈ బుల్లోడి అడుగు పడితే దద్దరిల్లాల్సిందే’ అంటూ డైలాగ్ చెప్పి, ఆహూతులను ఉత్సాహపరిచారు. అశోక్‌కుమార్ మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారు ఎవరి సహాయం లేకుండా పైకి వచ్చిన వ్యక్తి. సునీల్ కూడా అంతే. చిరంజీవిగారు ఎలాగైతే డ్యాన్సులు చేస్తారో, సునీల్ కూడా అలాగే చేస్తాడు. సో... తనలో చిరంజీవిగారిని చూసుకోవచ్చు’’ అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో ఈ చిత్రం రూపొందడం విశేషమని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ వేడుకలో మాగంటి బాబు, జయప్రకాష్‌రెడ్డి, అంబికా కృష్ణ, రఘురామరాజు, అనూప్, నాగేశ్వరరావు, చంద్రబోస్, రాజారవీంద్ర, ఎస్తర్ తదితరులు మాట్లాడారు. -
భీమవరం బుల్లోడు ఆడియో సందడి
-
ఆంధ్రా అమెరికా భీమవరం
భీమవరం, న్యూస్‌లైన్ : ‘భీమవరాన్ని ఆంధ్రా అమెరికాగా పిలుస్తుంటాను.. ఎందుకంటే వేర్ఆర్యూ అని అక్కడ పిలుస్తారు.. ఇక్కడ హే... ఎక్కడికి వెళ్తున్నావ్.. అని ఆప్యాయతగా పలకరిస్తారు. అందుకే నేనలా ఉచ్చరిస్తాను’ అని హీరో సునీల్ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి సునీల్ హీరోగా నటించిన ‘భీమవరం బుల్లోడు’ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో డీఎన్నార్ క్రీడా మైదానంలో ఆటలు ఆడుకున్నాని గుర్తుచేశారు. మొదటగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు తరువాత వర్షం సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఈ ప్రాంగణంలో భారీగా జనం వచ్చారని.. మరలా ఇప్పుడు అంతటి జనాన్ని చూస్తున్నానని చెప్పారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి డీఎన్నార్ అధ్యాపకులు, స్నేహితులు కారణమని, వారికి రుణపడి ఉంటానన్నారు. సినీ హీరోయిన్ ఎస్తేరు మాట్లాడుతూ భీమవరం రావడం ఇదే మొదటిసారని, ఈ ప్రాంత ప్రజల ఆపాయత్యలను ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు. సినిమా దర్శకుడు ఉదయ్ శంకర్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నిర్మాత మాగంటి బాబు మాట్లాడారు. పారిశ్రామిక వేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ భీముడిలా ఉండే సునీల్ భీమవరం బుల్లోడుగా మారాడని అన్నారు. ఇంకా మంచి చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. ముందుగా పలు గ్రూపుల డాన్స్‌లు ఆకట్టుకున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత డి.సురేష్‌బాబు ఆడియో సీడీని విడుదల చేసి మొదటి సీడీని సునీల్‌కి అందజేశారు. సురేష్ సంస్థ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 50 కిలోల కేక్ కట్ చేశారు. సునీల్, ఎస్తేరు స్టెప్పులేసి అభిమానులను ఉర్రూతలూగించారు. నటులు పృధ్వీరాజ్, జయప్రకాశ్ రెడ్డి, శివపార్వతి, పద్మ, గౌతమ్ రాజు, సినీ పాటల రచయిత చంద్రబోస్, అనంత శ్రీరాం, డాన్స్ మాస్టారు భాను, హరీష్, వితిక, రాజారవీంద్ర, కమెడియన్ రఘు, డీటీఎస్ ఆనంద్, గాయకులు అంజనా సౌమ్య, నిర్మాత అశోక్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. అభిమానులతో డీఎన్నార్ కళాశాల మైదానం కిటకిటలాడింది. -
ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను
పాఠాలు చెప్పే గురువులు చాలామంది ఉంటారు కానీ, జీవిత పాఠాల్ని కూడా నేర్పే గురువులు మాత్రం అరుదుగా లభిస్తారు. సున్నం ఆంజనేయులుగారు అలాంటి అరుదైన వ్యక్తి. ప॥జిల్లాలోనే ఆయన ఫేమస్. ఆయన దగ్గర అక్షరభిక్ష పొంది ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు కోకొల్లలు. నేను భీమవరంలోని డీఎన్నార్ కాలేజీలో చదువుకుంటున్నపుడు ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పాలిటిక్స్. గమ్మత్తేమిటంటే నేను అత్తిలి కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేసినపుడు ఆయన దానికి ప్రిన్సిపాల్. ఇలాంటి అరుదైన సందర్భం కొంతమందికే దక్కుతుంది. బుద్ధిజం, కమ్యూనిజం, లెనినిజం, హ్యూమనిటీ... ఇవన్నీ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన క్లాసంటే ఫుల్ అటెండెన్స్. పిన్ డ్రాప్ సెలైన్స్. ఎంత అద్భుతంగా పాఠాలు చెప్తారో ఆయన. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. నేను సినిమా ఫీల్డ్కి వెళ్తానంటే, ఎందుకయ్యా కష్టాలు అని వారించారు. ఆ తర్వాత నా ఎదుగుదల చూసి చాలా సంతోషపడ్డారు. ఆయన్ని తరచుగా వెళ్లి కలుస్తుండేవాణ్ణి. ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. ఆయన సహధర్మచారిణి సున్నం శారదాదేవి కూడా మహాతల్లి. అచ్చం రామకృష్ణ పరమహంసకు శారదాదేవిలాగానే. వాళ్లు అక్షరాలతో పాటు ప్రేమను పంచిన వందలాది మందిలో నేనూ ఒకణ్ణి కావడం నా అదృష్టం. - బ్రహ్మానందం