‘సోలార్’ వైపు.. మనోళ్ల చూపు | intrest on solar power projects | Sakshi
Sakshi News home page

‘సోలార్’ వైపు.. మనోళ్ల చూపు

Published Wed, Aug 20 2014 2:44 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

‘సోలార్’ వైపు.. మనోళ్ల చూపు - Sakshi

‘సోలార్’ వైపు.. మనోళ్ల చూపు

 ఏలూరు : సౌర విద్యుత్ ఉత్పత్తిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు, భీమవరంలో విష్ణు, డీఎన్నార్ వంటి విద్యాసంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్‌లను నెలకొల్పి సొంత అవసరాలకు సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నార. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇందుకు జిల్లాలో పెద్దఎత్తున ఉన్న కాలువలను ఉపయోగించుకోవడం ద్వారా స్థల సమస్యను అధిగమించే యోచనలో ఉన్నారు. ప్రయోగాత్మకంగా లోసరి కెనాల్‌పై సోలార్ ఫలకాలను అమర్చడం ద్వారా 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.
 
ఇది ఎలా చేయూలనే విషయమై గుజరాత్‌లోని బరోడా ప్రాం తాన్ని సందర్శించారు. అక్కడి కాలువలపై సోలార్ ఫలకాలను అమర్చి విద్యుత్ ఉత్పిత్తి చేస్తున్న తీరును అధ్యయనం చేసివచ్చారు. సోలార్ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే రాష్ట్రాలకు అందుకయ్యే ఖర్చులో 30 శాతాన్ని సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ఈ నేపథ్యంలో భీమవరం నియోజకవర్గ పరిధిలో విస్తరించివున్న లోసరి కాలువపై 15 కిలోమీటర్ల మేర సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేయూలని ఇరిగేషన్, నెడ్‌క్యాప్ అధికారులు నిర్ణరుుంచారు. ఇందుకు రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
 
ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి రూ.7 కోట్లు

ఒక మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరాల కోసం రూ.7 కోట్ల వరకూ అవసరం అవుతుందని అంచనా. లోసరి కాలువపై ఏర్పాటు చేసే ఫలకాల నుంచి 25 ఏళ్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడానికి వీలుంటుంది. కేంద్రం ఇచ్చే 30 శాతం సబ్సిడీపోగా మిగిలిన 70 శాతం పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉం టుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నిధులొస్తాయూ, రావా అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నారుు. ఈ దృష్ట్యా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చలు సాగుతున్నారుు. లోసరి కాలువపై ఫలకాల ఏర్పాటు, తదితర పనుల కోసం 10 నెలలు సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు.
 
గుజరాత్ వెళ్లొచ్చిన అధికారులు
గుజరాత్‌లో సౌర విద్యుత్ ఉత్పాదన ప్రక్రియను పరిశీలించేందుకు 10 రోజుల క్రితం సర్థార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ చీఫ్ ఇంజినీర్ యూసీ జైన్, ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ డోల తిరుమలరావు, నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ డీవీ ప్రసాద్‌లతో కూడిన బృందం ఆ రాష్ట్రంలో పర్యటించి వచ్చింది. ఖాళీ స్థలాల్లోను, కాలువలపై సోలార్ యూనిట్ల ఏర్పాటు, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీ లించి వచ్చిన అధికారులు అదే పద్ధతిని ఇక్కడ అనుసరించేందుకు గల అవకాశాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఒక మెగావాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే సోలార్ ఫలకాల ఏర్పాటుకు 5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. జిల్లాలో భూముల ధరల చాలా అధికంగా ఉన్నారుు.
 
ఈ దృష్ట్యా భూమిని సమకూర్చుకోవడానికి భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కాలువలపై సౌర విద్యుత్ ఫలకాలను అమర్చుకుంటే భూమి సమస్య తీరుతుంది. అరుుతే, సోలార్ ఫలకాలను అమర్చాలంటే కాలువ వెడల్పు 16 మీటర్లు ఉండాలి. లోసరి కాలువ 15 మీటర్లు వెడల్పున ఉండటంతో దీనిపై 20 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు ప్రతిపాదించామని ఇరిగేషన్ ఎస్‌ఈ డోల తిరుమల రావు తెలిపారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసేం దుకు వీలుగా కాలువపై ఇనుప పరికరాలను అమర్చాల్సి ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ మంజూరైతే 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంటుందని ఎస్‌ఈ పేర్కొన్నారు.
 
ఐదేళ్లలో పెట్టుబడి రాబట్టవచ్చు

సౌర విద్యుత్ ఉత్పాదనకు పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలో తిరిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గుజరాత్‌లో 10 మెగావాట్ల ప్లాంట్ ద్వారా  1.6 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. దీనికి రూ.10 కోట్లు ఖర్చు పెట్టగా, తాజా పరిస్థితుల్లో ఆ ఖర్చు సగానికి పైగా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మన జిల్లాలో ఒక మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి రూ.7కోట్లు సరిపోతుందని అంచనా వేసినట్టు ఇరిగేషన్ ఎస్‌ఈ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement