
'బీజేపీలో చేరమని ఎవ్వర్నీ ఆహ్వానించడం లేదు'
బీజేపీలో చేరమని తాము ఎవ్వర్నీ ఆహ్వానించడం లేదని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
కాకినాడ: బీజేపీలో చేరమని తాము ఎవ్వర్నీ ఆహ్వానించడం లేదని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీజేపీలో చేరాలనుకునే వారు ఆ పార్టీ సెల్ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవచ్చన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కామినేని.. వైద్య సేవల్లో సీఎం చంద్రబాబు పలు సంస్కరణలు తీసుకొస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
త్వరలోనే ఏపీలో బ్రాండెడ్ జనరిక్ షాపులను ఏర్పాటు చేస్తామని కామినేని తెలిపారు.