రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్లో తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్లో తెలిపారు. అందుకోసం మంగళవారం సాయంత్రం రాష్ట్రానికి చెందిన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు న్యూఢిల్లీ బయలుదేరనున్నట్లు వెల్లడించారు.
ప్రధాని, కేంద్రమంత్రులు రాజ్నాథ్, జైట్లీ, వెంకయ్యతోపాటు పార్టీ అధ్యక్షుడు అమిషాను కలుస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రెవెన్యూ లోటు, రాయలసీమ కరువు, రాజధాని నిధుల కోసం కేంద్రాన్ని కోరనున్నట్లు కామినేని శ్రీనివాస్ వివరించారు.