కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో! | ysrcp sc cell president meruga nagarjuna slams kamineni srinivas | Sakshi
Sakshi News home page

కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో!

Published Mon, Sep 19 2016 2:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో!

కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో!

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తానికి జ్వరం వచ్చినా, కామినేని మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చేతగాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆరోగ్య శాఖమంత్రి కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో అని, ఆయనకు బీపీ చూడటం కూడా రాదని మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఇక ముఖ్యమంత్రి  చంద్రబాబు ఆలోచనంతా కమీషన్లు, వాటాలు, కేసులేనని ఆయన ఎద్దేవా చేశారు. వస్తువులకు లోకల్ ట్యాక్స్ల్లా, ఏపీలో లోకేశ్ ట్యాక్స్ల పేరుతో వసూలు చేస్తున్నారంటూ మేరుగ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement