
ముఖ్యంగా అనసూయగారు తన తండ్రి చనిపోయిన బాధలోనూ షూటింగ్‌కి వచ్చి, మాకు సహకరించారు. హైదరాబాద్, భీమవరం..
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పీఎస్‌ఎస్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ఈ ఫస్ట్ లుక్ దర్జాగా ఉంది. సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సునీల్‌గారు, అనసూయగారు, ఇతర నటీనటులు ఎంతగానో సహకరిస్తున్నారు. ముఖ్యంగా అనసూయగారు తన తండ్రి చనిపోయిన బాధలోనూ షూటింగ్‌కి వచ్చి, మాకు సహకరించారు. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలో షూటింగ్ చేశాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.