Saleem Malik
-
'పబ్లిసిటీ కోసమే ఇదంతా.. మాట్లాడడం వ్యర్థం'
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్.. తన ఆటోబయోగ్రఫీ ''సుల్తాన్: ఏ మొమొయిర్'' ద్వారా వరుసగా సంచలన విషయాలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ''విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు పాక్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ తనను ఒక పనివాడిలా చూసేవాడని.. బట్టలు ఉతికేంచేవాడని.. అవసరమైనప్పుడల్లా మసాజ్ చేయించుకునేవాడు.. అంతేకాదు అతనొక స్వార్థపరుడు.. నాకు బౌలింగ్ ఇవ్వడానికి ఆలోచించేవాడు'' అంటూ అక్రమ్ తన బయోగ్రఫీలో పేర్కొనడం ఆసక్తిని రేపింది. అయితే తాజాగా అక్రమ్ వ్యాఖ్యలపై సలీమ్ మాలిక్ ఎదురుదాడి చేశాడు. ''వాస్తవానికి అక్రమ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు. మేం అప్పట్లో ఏ టూర్‌కు వెళ్లినా అక్కడ లాండ్రీ మెషిన్లు ఉంటాయి. మా బట్టలు అందులో వేసేవాళ్లం తప్ప ఎవరు ఉతుక్కునేవాళ్లం కాదు. ఇక నేను స్వార్థపరుడిని అంటున్నాడు. నిజానికి నేను కాదు అక్రమ్ స్వార్థపరుడు. తన గురించి గొప్పగా చెప్పుకోవడం కోసం ఎన్ని అబద్దాలు అయినా చెప్తాడు. తాజాగా తన బయోగ్రఫీలోనూ అదే పేర్కొన్నాడు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడు. తనను తాను అవమానించుకుంటున్నట్లు అతనికి అర్థమవడం లేదు. అయినా అక్రమ్ వ్యాఖ్యలపై ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బట్టలు ఉతికించడం.. మసాజ్ చేయించడం లాంటి పదాలు వాడాడు కాబట్టే.. అవన్నీ అబద్దాలు అని మాత్రమే చెప్పగలను. ఇంతకుమించి నేను ఏం మాట్లాడదలచుకోలేదు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సలీమ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా మాలిక్ సారథ్యంలో 1992-1995 కాలంలో అక్రమ్ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో అతనిపై జీవితకాలం నిషేధం పడింది. చదవండి: అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్ బుడ్డోడి మోచేతి ధర రూ. 40 లక్షలంట! -
అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఎ-మొమొయర్ ద్వారా మరో బాంబ్‌ను పేల్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సహచర ఆటగాడు సలీమ్ మాలిక్ తన పట్ల అమానవీయంగా ప్రవర్తించాడని అక్రమ్ ఆరోపించాడు. మాలిక్ తనను ఒక బానిసలా చూసేవాడని అక్రమ్ వెల్లడించాడు. కాగా సలీమ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా మాలిక్ సారథ్యంలో 1992-1995 కాలంలో అక్రమ్ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో జీవితకాలం నిషేధం విధించబడింది. "సలీమ్ మాలిక్ చాలా స్వార్ధపరుడు. అతడు తన సీనియారిటీ నాపై ఉపయోగించేవాడు. నన్ను అతడి సేవకుడిలా చేసుకున్నాడు. నేను అతడికి మసాజ్ చేయాలని డిమాండ్ చేసేవాడు. అదే విధంగా తన బట్టలు, బూట్లు శుభ్రం చేయమని నన్ను ఆదేశించేవాడు. నా సహచర ఆటగాళ్లు రమీజ్, తాహిర్, మొహ్సిన్, షోయబ్ మొహమ్మద్ నన్ను నైట్‌క్లబ్‌లకు పిలిచే వారు. ఆ సమయంలో వాళ్లపై చాలా కోపం వచ్చేది" అని తన ఆత్మకథలో అక్రమ్ రాసుకున్నాడు. కాగా గతంలో సలీమ్ మాలిక్ కూడా చాలా సార్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్‌పై తీవ్రమైన వాఖ్యలు చేశాడు. నన్ను అసలు కెప్టెన్‌గా కొంచెం కూడా గౌరవించకపోయే వారని చాలా సందర్భాల్లో మాలిక్ తెలిపాడు. చదవండి: Wasim Akram Rehab Experience: 'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే' -
'తండ్రి చనిపోయిన బాధలోనూ అనసూయ షూటింగ్‌కు వచ్చింది'
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పీఎస్ఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ఈ ఫస్ట్ లుక్ దర్జాగా ఉంది. సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సునీల్‌గారు, అనసూయగారు, ఇతర నటీనటులు ఎంతగానో సహకరిస్తున్నారు. ముఖ్యంగా అనసూయగారు తన తండ్రి చనిపోయిన బాధలోనూ షూటింగ్‌కి వచ్చి, మాకు సహకరించారు. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలో షూటింగ్ చేశాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.