పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ తన ఆత్మకథ సుల్తాన్-ఎ-మొమొయర్ ద్వారా మరో బాంబ్‌ను పేల్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సహచర ఆటగాడు సలీమ్ మాలిక్ తన పట్ల అమానవీయంగా ప్రవర్తించాడని అక్రమ్ ఆరోపించాడు. మాలిక్ తనను ఒక బానిసలా చూసేవాడని అక్రమ్ వెల్లడించాడు.
కాగా సలీమ్ మాలిక్ పాకిస్తాన్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన రెండేళ్ల తర్వాత 1984లో వసీమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా మాలిక్ సారథ్యంలో 1992-1995 కాలంలో అక్రమ్ 12 టెస్టులు, 34 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో జీవితకాలం నిషేధం విధించబడింది.
"సలీమ్ మాలిక్ చాలా స్వార్ధపరుడు. అతడు తన సీనియారిటీ నాపై ఉపయోగించేవాడు. నన్ను అతడి సేవకుడిలా చేసుకున్నాడు. నేను అతడికి మసాజ్ చేయాలని డిమాండ్ చేసేవాడు. అదే విధంగా తన బట్టలు, బూట్లు శుభ్రం చేయమని నన్ను ఆదేశించేవాడు. నా సహచర ఆటగాళ్లు రమీజ్, తాహిర్, మొహ్సిన్, షోయబ్ మొహమ్మద్ నన్ను నైట్‌క్లబ్‌లకు పిలిచే వారు.
ఆ సమయంలో వాళ్లపై చాలా కోపం వచ్చేది" అని తన ఆత్మకథలో అక్రమ్ రాసుకున్నాడు. కాగా గతంలో సలీమ్ మాలిక్ కూడా చాలా సార్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్‌పై తీవ్రమైన వాఖ్యలు చేశాడు. నన్ను అసలు కెప్టెన్‌గా కొంచెం కూడా గౌరవించకపోయే వారని చాలా సందర్భాల్లో మాలిక్ తెలిపాడు.
చదవండి: Wasim Akram Rehab Experience: 'కొకైన్ కోసం పిచ్చోడిలా తిరిగా.. అక్కడ నిత్యం నరకమే'
Comments
Please login to add a commentAdd a comment