
'రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత తీవ్రం'
రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: రానున్న రెండు రోజుల్లో ఎండలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రతపై మీడియాతో మాట్లాడిన కామినేని.. పీహెచ్ సీ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రుల వరకూ అవసరమైన మందులు సిద్ధం చేశామన్నారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలెవరూ ఎండల్లో బయటకు రావద్దని.. వడదెబ్బకు ఆదివారం ఒక్కరోజే 62మంది మృతి చెందారని పేర్కొన్నారు.