
ఉచిత విద్యుత్ కు నిధుల కోత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో ఉచిత విద్యుత్ పథకానికి భారీగా నిధులు కోత పెట్టారు. గతేడాది పోలిస్తే కేటాయింపులు భారీగా తగ్గించారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు.ఈసారి బడ్జెట్ లో ఉచిత విద్యుత్ కు రూ. 3,000 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ లో పోలిస్తే ఇది రూ.188 కోట్లు తక్కువ.