కాకినాడ: వలలు, పడవలు నష్టపోయిన మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు వెల్లడించారు. బుధవారం కాకినాడలో సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ప్రతిపాటితోపాటు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, ప్రతిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర పరామర్శించారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వేటకు వెళ్లిన ప్రతి మత్స్యకారుడు తమ బోట్లకు తప్పనిసరిగా డాట్ మిషన్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి సూచించారు.