fishermen families
-
మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
మనసుంటే మార్గమూ ఉంటుంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఓఎన్జీసీ పైపులైన్ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నిధులు విడుదల చేశారు. దీంతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్ల లబ్ధి చేకూరింది. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ ఏమన్నారంటే: ‘‘ఇవాళ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా.. ఒక మంచి కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేసేందుకు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.’’ ‘‘నిజానికి ఇవాళ తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమం వీలునుబట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతాం. ఇవాళ ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7500 మంది, మొత్తంగా 23,458 మంది ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నాం. నెలకు రూ.11,500 చొప్పున చెల్లించే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీతో మాట్లాడి, వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మత్స్యకారుల తరపున ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశల్లో రూ. 323 కోట్లు నష్టపరిహారం ఇప్పటికే ఇప్పించాం. ఈ రోజు 4వ విడతగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 6 నెలలకు సంబంధించి రూ.161 కోట్లు పరిహారం ఈరోజు ఇక్కడి నుంచి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతోంది. నాలుగో విడతలో ఇవాళ మనం ఇస్తున్న రూ.161 కోట్లు కలుపుకుంటే మొత్తంగా రూ.485 కోట్లు పరిహారంగా 23,458 కుటుంబాలకు మనం ఇవ్వగలిగాం. ఇంతకుముందు 2012లో కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జీఎస్పీసీ అప్పట్లో ఇదే రకమైన కార్యక్రమం చేయడం వలన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు నష్టం జరిగింది. రూ.78 కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. అప్పటి నుంచి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇవ్వని పరిస్థితి. మనకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలన చేసినా కూడా కనీసం ఇది ఇప్పించాలి, మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఆలోచన చేయలేదు. ఈ డబ్బులు పడకపోతే ఆ మత్స్యకార కుటుంబాలు ఏ రకంగా బతకగలుగుతాయి ? వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాలన్న ఆలోచన గతంలో జరగలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు పెట్టి వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఫస్ట్ మనం ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేసి.. తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ డబ్బును వెనక్కు ఇప్పించుకోగలిగాం. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. ఎక్కడైతే మంచి చేయాలనే తపన ఉంటుందో అక్కడ దేవుడి సహకారం ఉంటుంది. దానికి నిదర్శనమే జీఎస్పీసీ పరిహారం ఉదంతం. ఇవాళ కూడా ఉభయగోదావరి జిల్లాల్లో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి చేసే కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా, ప్రతి సంవత్సరం వచ్చేటట్టుగా అడుగులు వేస్తూ.. నాలుగోదఫా రూ.161 కోట్లు ఇప్పిస్తూ... మొత్తంగా రూ.485 కోట్లు ఇప్పించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇవాళ మత్స్యకారుల సంక్షేమం పట్ల ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తోందన్నది చెప్పడానికి.. నిన్న విశాఖపట్నంలో జరిగిన ఘటనే ఉదాహరణ. 40 బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వస్తే వెంటనే వాళ్లని ఆదుకోవాలని తపన, తాపత్రయం పడ్డాం. వాటికి ఇన్సూరెన్స్ ఉందా ? లేదా ? అని విచారణ చేశాం. ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదని.. వాళ్లకు మేలు చేయాలని, ప్రతి బోటు విలువ లెక్కగట్టమని చెప్పాం. ఆ బోటుకు సంబంధించి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించాం. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది. ఈ కార్యక్రమంలో సహకరించిన, తోడుగా ఉన్న ఓఎన్జీసీ అధికారులందరికీ మనస్పూర్తిగా నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని సీఎం తన ప్రసంగం ముగించారు. చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి -
మాటంటే మాటే..
సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ సమయానికి సహాయం అందలేదని, ఇచ్చిన మాట మేరకు కష్టకాలంలో కూడా ఇప్పుడు మీరు పార్టీలు చూడకుండా సాయం చేస్తున్నారని పలు జిల్లాల మత్స్యకారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమం సందర్భంగా బుధవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల్లోని మత్స్యకారులు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్‌తో పంచుకున్నారు. అధికారంలోకి వచ్చాక కేవలం ఏడు నెలల వ్యవధిలోనే రెండోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేవుడి దయతో ఇంకా ఇలాంటివి చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. విజయనగరం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా పూసపాటిరేగమండలం చింతపల్లి లేదా కోనాడలో ఫిషింగ్ జెట్టీ నిర్మించాలని కోరడంతో సీఎం అంగీకరించారు. మత్స్యకారుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. పలు పథకాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు మా ఆయన అనుకోకుండా పాకిస్తాన్ సైనికుల చేతికి చిక్కి జైలులో మగ్గిపోతున్నాడని.. మీరు పాదయాత్రలో మా ఊరికి వచ్చినప్పుడు చెప్పాము. విడిపిస్తానని మీరు అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మేరకు జైలు నుంచి విడిపించారు. అంతే కాకుండా రూ.5 లక్షలు ఇచ్చారు. దీంతో మేము బోటు కొనుక్కుని ఇక్కడే బతుకుతున్నాం. అనేక సంక్షేమ పథకాలతో మమ్మల్ని ఆదుకుంటున్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో మూడు సార్లు రేషన్ ఇచ్చారు. డబ్బులు కూడా ఇచ్చారు. అందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా బోట్లకు బీమా సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నాము. – కె.శిరీష, శ్రీకాకుళం జిల్లా కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండిలో తమ ఖాతాల్లో నగదు జమ అయిన మెసేజ్ చూపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న మోహన్‌బాబు కుటుంబం అప్పట్లో ఆ పార్టీ వాళ్లకు మాత్రమే ఇచ్చేవారు గత ప్రభుత్వ హయాంలో చేపల వేట నిషేధ సమయంలో రూ.4 వేలు ఇచ్చేవారు. అది ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు. ఆ పార్టీ వారికి మాత్రమే ఇచ్చేవారు. ప్రజా సంకల్ప యాత్రలో మా బాధలను మీకు చెప్పాం. దేవుడి దయతో మీరు అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.10 వేలు ఇస్తున్నారు. ప్రతి మత్స్యకారుడికి పెన్షన్ కింద రూ.2250 ఇస్తున్నారు. డీజిల్‌పై సబ్సిడీ కూడా రూ.9కి పెంచారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. – మైలపల్లి పోలీసు, శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు పెద్ద కొడుకు మీరు గతంలో మాకు కొంత మాత్రమే సబ్సిడీ వచ్చేది. మీరు వచ్చాక ఆ మొత్తం పెంచారు. డీజిల్‌పై సబ్సిడీ కూడా రూ.9కి పెంచి వెంటనే ఇచ్చేస్తున్నారు. మాలో ఒకరిని రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇది మా అందరికీ గౌరవం. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. మత్స్యకారుల కుటుంబానికి పెద్దకుమారుడు మీరు. – నర్సింగ్‌రావు, బోటు యజమాని, విశాఖపట్నం పది కాలాలు మీరు చల్లగా ఉండాలి అమ్మ ఒడి ద్వారా మా పిల్లలను చదివించుకునేందుకు మీరు సహాయపడుతున్నారు. నా ఇద్దరు బిడ్డలూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజనం కూడా బాగుండడంతో వారు సంతోషంగా బడికి వెళ్తున్నారు. మా వాళ్లలో చాలా మందికి వలంటీర్ పోస్టులు కూడా ఇచ్చారు. పది కాలాలు మీరు చల్లగా ఉండాలి. కరోనా సమయంలో కూడా మీరు ఉచితంగా మూడు సార్లు రేషన్ ఇచ్చారు, డబ్బు చేతిలో పెట్టారు. చాలా సంతోషంగా ఉన్నాం. – గరికిన యోహాను, సూర్యారావుపేట, కాకినాడ ఆ గ్రాఫిక్స్ సీఎం ఏమీ చేయలేదు గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి పరిహారం ఇప్పించాలని కోరాం. 63 గ్రామాల ప్రజలు 103 రోజులు పోరాటం చేశారు. 13 నెలలకు పరిహారం ఇస్తామని వారు చెప్పారు. కానీ 6 నెలలకు మాత్రమే ఇచ్చి.. మిగతా డబ్బు ఇవ్వలేదు. అప్పట్లో గ్రాఫిక్స్ సీఎం ఆ విషయాన్ని మరిచిపోయారు. మమ్మల్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారు. మీ పాదయాత్రలో మా సమస్యలను నివేదించాం. మీరు వచ్చిన తర్వాత ఆ డబ్బు ఇచ్చారు. మత్స్యకారులకు మీరు చేసినట్టుగా మరెవ్వరూ సేవ చేయలేదు. – పోతురాజు, గచ్చికాయలపురం, తూర్పుగోదావరి జిల్లా త్వరగా స్పందించి ఆదుకున్నారు నా భర్తను కోల్పోయి బాధల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకున్నారు. మా ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు నాకు అండగా నిలబడ్డారు. మీ మేలును ఎప్పుడూ మరిచిపోలేను. కష్టం వచ్చిందని తెలియగానే ఇంత త్వరగా స్పందించి మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. (భావోద్వేగంతో ఈమె కన్నీళ్లు పెట్టుకోగా.. సీఎం జగన్ ధైర్యం చెప్పారు) – జెల్ల లక్ష్మి, కృష్ణా జిల్లా పాకిస్తాన్ నుంచి వస్తారని అనుకోలేదు జెట్టీలు, హార్బర్లు లేకపోవడం వల్లే మేం వలస పోతున్నామనే విషయాన్ని మీకు పాదయాత్రలో నివేదించాం. ఆ మాటలన్నీ మీరు గుర్తు పెట్టుకుని మేజర్ ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తామని చెప్పడం సంతోషకరం. పాకిస్తాన్ జైలు నుంచి తిరిగి వస్తామని మా మత్స్యకారులు అనుకోలేదు. కానీ మీరు తీసుకు వచ్చారు. ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాం. – బర్రి పోలయ్య, విజయనగరం జిల్లా -
మత్స్యకారులకు ఇక ఆర్థిక సుస్థిరత
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు వారి ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేయనున్నాయి. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం. ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. దీంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది. ముమ్మిడివరంలో ‘మత్స్యకార’ దినోత్సవం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో బుధవారం మార్కెటింగ్, మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు. వేటకెళ్లే మత్స్యకారులందరికీ వైఎస్సార్ మత్స్యకార భరోసా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ వైఎస్సార్ మత్స్యకార భరోసా అందుతుందని ప్రభుత్వం బుధవారం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా, వాహన మిత్ర, సంక్షేమ పింఛన్లు పొందే వారు చేపల వేట కూడా సాగిస్తుంటే వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద సాయం అందుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నేడు సీఎం కార్యక్రమాలు ఇలా.. - సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం 9 గంటలకు తాడే పల్లి నివాసం నుంచి బయలు దేరి 9.45 గంటలకు ముమ్మడివరం మండలం గాడిలంక చేరుకుంటారు. - వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ వారధిని ప్రారంభిస్తారు. (ఈ వంతెన నిర్మాణంతో గోదావరి అటు, ఇటు ఉన్న 11 గ్రామాల్లోని 10 వేల మందికి ప్రయోజనం. ఈ వంతెనకు 2009లో దివంగత వైఎస్సార్ శంకుస్థాపన చేశారు.) వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. - ముమ్మడివరం మండలం కొమానపల్లిలో జరిగే బహిరంగ సభలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జీఎస్పీసీ బకాయిలు అందజేస్తారు. - ముమ్మిడివరంలో డిగ్రీ కాలేజీ, ఎదుర్లంక వద్ద తీర గ్రామాల పరిరక్షణ కోసం రూ.70 కోట్ల ప్రాజెక్టు, బోటు ప్రమాదాల నివారణ కోసం బోటు కంట్రోల్ రూమ్‌లకు శంకుస్థాపన. - మధ్యాహ్నం యానాం చేరుకుని, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు నివాసానికి వెళతారు. ఇటీవల తండ్రిని కోల్పోయిన ఆయన్ను పరామర్శించి తాడేపల్లికి బయలుదేరుతారు. మత్స్యకారులకు మేలు ఇలా - మర పడవల నిర్వాహకులకు గత ప్రభుత్వం లీటర్ డీజిల్‌కు ఇచ్చే రూ.6.03 రాయితీ ఇప్పుడు రూ.9కి పెంపు. మరపడవలకే కాకుండా ఇంజను కలిగిన తెప్పలకూ డీజిల్ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ ఇస్తారు. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్ కార్డుల ద్వారా రాయితీ అందుతుంది. - సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం. (ఇప్పటి దాకా రూ.5 లక్షలు మాత్రమే) - తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్ లాండింగ్ సదుపాయాల కల్పన. మూడు కొత్త ఫిషింగ్ హార్బర్లు (నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో) ఏర్పాటు. మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల పటిష్టానికి చర్యలు. - 2012లో సముద్రంలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల అన్వేషణకు జరిపిన తవ్వకాల్లో ముమ్మిడివరం ప్రాంతంలో జీవన భృతి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం (జీఎస్పీసీ బకాయిలు) అందించనుంది. దీని ద్వారా 16,559 మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి. ఓఎన్జీసీ చెల్లించ వలసిన ఈ పరిహారాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తోంది. -
వలలో వరాల మూట
సాక్షి, అమరావతి బ్యూరో/నిజాంపట్నం: ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. సీఎం వైఎస్ జగన్ బడ్జెట్లో మత్స్యకారులకు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకారుల కుటుంబాల సంక్షేమం కోసం ఎన్నడూ లేని రీతిలో బడ్జెట్లో అధిక శాతం కేటాయింపులు చేశారు. దీని ద్వారా జిల్లాలో వేలాది మంది మత్స్యకార కుటుంబాలకు మేలు చేకూరనుంది. సీఎం నిర్ణయంతో జిల్లాలోని మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 161 మత్స్యకార సొసైటీలు, 25,280 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వేట సమయంలో మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇంతకు మునుపు కేవలం లక్ష రూపాయలు పరిహారం మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం దానిని ప్రభుత్వం రూ.10 లక్షలు పెంచారు. నిజాంపట్నం, బాపట్ల, రేపల్లె మండలాల్లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.4 వేలు నుంచి 10 వేలకు పెంచారు. దీని ద్వారా జిల్లాలో 7968 మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి రూ.15 కోట్ల డీజిల్ రాయితీ జిల్లాలో మత్స్యకారులకు సంబంధించి పెద్ద బోట్లు 218 ఉన్నాయి. వీటికి నెలకు 3 వేల లీటర్ల డీజల్‌ను సబ్సిడీపై ఇస్తారు. 1874 చిన్న బోట్లకు నెలకు 300 లీటర్ల డీజల్‌ను సబ్సిడీపైన ఇవ్వనున్నారు. ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని రూ.6.03 పైసల నుంచి రూ.12.06 పైసలకు పెంచింది. గతంలో కేవలం పెద్ద బోట్లకు మాత్రమే సబ్సిడీపై డీజిల్ ఇచ్చేవారు. ప్రస్తుతం చిన్న బోట్లకూ సబ్సిడీపై డీజిల్ అందించనున్నారు. దీంతో ఏడాదికి దాదాపు రూ.15 కోట్ల డీజిల్ సబ్సిడీని మత్స్యకారులు పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రొయ్యల చెరువులు 8123 హెక్టార్లు, చేపల చెరువులు 500 హెక్టార్ల విస్తీర్ణంలో 5500 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ యూనిట్ రూ.6 చార్జీ ఉండేది. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీని యూనిట్‌కు రూ.2.70 పైసలకు తగ్గించారు. ప్రస్తుతం సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ చార్జీని యూనిట్‌కు రూ.1.50లకు తగ్గించారు. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధి కోసం.. నిజాపట్నం హార్బర్ అభివృద్ధికి మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రత్యేకంగా కృషి చేశారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న నిజాంపట్నం హార్బర్‌కు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. హార్బర్లో జెట్టీలను నిర్మించనున్నారు. ప్రస్తుతం బోట్లు నిలుపుకొనేందుకు స్థలం సరిపోవడం లేదు. హార్బర్ రేవు సముద్రంలో కలిసే చోట ఇసుక మేట వేయడంతో బోట్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. కేవలం సముద్రపు పోటు సమయంలో మాత్రమే బోట్లు హార్బర్‌కు వస్తున్నాయి. హార్బర్ పక్కనే ఉన్న రేవులో డ్రెడ్జింగ్ చేసిన ఇసుక దిబ్బలు తొలగించాలి. హార్బర్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించాలి. ప్రధాన రహదారిలో వీధి దీపాలు వెలగడం లేదు. మంచినీటి సదుపాయం లేదు. ప్రస్తుతం బడ్జెట్లో నిధుల కేటాయింపుతో ఈ సమస్య తీరనుంది. -
తుపాను హెచ్చరికల్లో ప్రభుత్వం విఫలం
♦ వేట నిషేధ సాయం అందించడంలో నిర్లక్ష్యం ♦ {పభుత్వ తీరుపై ఆగ్రహం ♦ మత్స్యకార కుటుంబాలకు జగన్మోహన్రెడ్డి పరామర్శ సాంబమూర్తినగర్ (కాకినాడ) : సముద్రంలో తుపాను, అల్పపీడన ద్రోణి వంటి ఉపద్రవాలు ఏర్పడినప్పుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లి అల్పపీడనం కారణంగా సముద్రంలో చిక్కుకుని గల్లంతైన మత్స్యకార కుటుంబాలను శుక్రవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, కరప మండలాల్లో ఆయన పర్యటించారు. జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తుపాను హెచ్చరికలు చేయకుండా జిల్లాలో తొమ్మిది మంది మత్స్యకారులను హత్య చేసిందని ఆరోపించారు. మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంలో ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. ఈ ఏడాది 60 రోజుల పాటు వేట నిషేధాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు సాయం అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. వేట నిషేధం ముగిసిన వెంటనే పొట్ట చేత పట్టుకుని సముద్రంపై చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల్లో జిల్లాకు చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుం బాలను పార్టీ తరఫున ఆదుకుంటామన్నారు. నిరుద్యోగ భృతి మాటేమైంది..? ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఆ మాటే మరిచారని జగన్మోహన్రెడ్డి విమర్శించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఆర్భాటంగా ప్రచారాలు చేశారని, చంద్రబాబు నాయుడు ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలు, రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. చేసిన అప్పులు తీరక, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. పర్యటనలో భాగంగా స్థానికులు ఎక్కడికక్కడ కాన్వాయ్‌ను ఆపి తమ సమస్యలు విన్నవించుకున్నారు. పింఛన్లు రావడం లేదని, రేషన్ కార్డు లేదని, డ్వాక్రా రుణ మాఫీ చేయలేదని ప్రజలు ఆయనకు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బాధిత కుటుంబాలకు పరామర్శ కాకినాడ పర్లోపేటలోని కంటుముర్చి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని శుక్రవారం ఉదయం పరామర్శించారు. మృతుడి భార్య కుమారి, కుమారుడు రాజు, కుమార్తెలు ఐశ్వర్య, స్వాతిలను ఓదార్చారు. పిల్లలు చిన్నవారు కావడంతో వారిని చదివించే బాధ్యత చూడాల్సిందిగా వైఎస్సార్సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చలమలశెట్టి సునీల్‌కు సూచించారు. అక్కడి నుంచి కరప మండలం ఉప్పలంకలోని బొమ్మిడి పెద కామేశ్వర రావు కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాకినాడ రూరల్ మండలం పగడాలపేటలోని గేదెల తాతారావు, చెక్కా బుజ్జిబాబు, కామాడి నూకరాజు, కర్రి రాజు, దరిపల్లి సింహాద్రి, తిర్రి సత్తిబాబు కుటుంబ సభ్యులను ఓదార్చారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కాకినాడ సిటీ, రూరల్ మండలాల్లో పర్యటించిన జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. -
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా
కాకినాడ: వలలు, పడవలు నష్టపోయిన మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు వెల్లడించారు. బుధవారం కాకినాడలో సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ప్రతిపాటితోపాటు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, ప్రతిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వేటకు వెళ్లిన ప్రతి మత్స్యకారుడు తమ బోట్లకు తప్పనిసరిగా డాట్ మిషన్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి సూచించారు. -
'ఉత్తరాంధ్రలోని మత్స్యకార కుటుంబాలను ఆదుకోండి'
పై-లీన్ తుపాన్ ప్రభావంతో సముద్రంలో చేపట వేటకు వెళ్లని మత్స్యకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి సీఎం కిరణ్‌ను కోరారు. తుపాన్‌తో చిగురుటాకులా వణికిన ఉత్తరాంధ్ర జిల్లాలో రఘువీరా ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను సీఎం కిరణ్‌కు ఫోన్లో ఆయన వివరించారు. 74 వేల మత్స్యకారుల కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం కిరణ్‌కు రఘువీరా విజ్ఞప్తి చేశారు. అందుకోసం జిల్లా యంత్రాగాన్ని ఆదేశించాలని ఆయన సీఎం కిరణ్‌ను కోరారు.