హైదరాబాద్: చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానంలో ఉందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మత్య్య పరిశ్రమను వృద్ధికారకంగా గుర్తించామన్నారు.
చేపల ఉత్పత్తికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. విజయవాడను ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా చేస్తామని హామీయిచ్చారు. మత్య్సకారుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడతామన్నారు. బడ్జెట్ లో మత్స్యశాఖకు రూ.187 కోట్లు కేటాయించారు.
'ఆక్వా కల్చర్ రాజధానిగా విజయవాడ'
Published Fri, Mar 13 2015 1:16 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM
Advertisement