
'జూన్ 2 పై విమర్శలు చేయడం తగదు'
హైదరాబాద్: జూన్ 2వ తేదీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ... వైఎస్ఆర్ సీపీ ప్రతిదాన్ని వివాదం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. జూన్ 2న అవతరణ దినం కాదనలేమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రం విడిపోయిన రోజు కాబట్టి ఉత్సవాలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నామన్నారు. నవంబర్ 1, అక్టోబర్ 1 రోజుల్లో ఎం చేయాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం మాని నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని ప్రత్తిపాటి పుల్లారావు ఈ సందర్భంగా ప్రతిపక్షానికి సూచించారు.