
'రుణమాఫీ వడ్డీతో సహా ఫిబ్రవరిలో చెల్లిస్తాం'
కర్నూలు : రెండో విడత రుణమాఫీ వడ్డీతో సహా ఫిబ్రవరిలో చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం కర్నూలు వచ్చిన పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో సీడ్ హబ్ కోసం 500 ఎకరాలు కేటాయించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 397 కరువు మండలాలు గుర్తించామని పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.