రైతు కుటుంబాలకు పరిహారం పెంపు
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. ఏపీ శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు.
రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల లోపు రుణాలు పావలా వడ్డీ ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. పావలా వడ్డీ రుణాలకు రూ.10 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మొదటి దశ రుణమాఫీకి 40.50 లక్షల ఖాతాలకు రూ.4,689 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు.