సాక్షి,హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణమాఫీని వీలైనంత త్వరలో అమలు చేస్తామని, అయితే ఎప్పటిలోగా చేస్తామనే విషయం స్పష్టంగా చెప్పలేమని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక వనరుల కమిటీ రెండు నెలల్లో దీనిని ఒక దశకు తెస్తామని సూత్రప్రాయంగా చెబుతోంది. ఈలోగా కట్టగలిగే స్తోమతున్న రైతులు కట్టేస్తే వారికి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ విషయంలో మాకు సాయం చేయాలని కేంద్రానికి ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఒత్తిళ్లవల్ల వెనుకడుగు వేస్తోంది. అంతమాత్రాన వారిని తప్పుపట్టలేం. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆదుకుంటుందనే నమ్మకం మాకుంది’’ అని మంత్రి చెప్పారు.
రుణ మాఫీ ఎప్పుడో చెప్పలేం : ప్రత్తిపాటి
Published Sun, Aug 17 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement