ఏపీ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు | andhra pradesh agriculture budget highlights | Sakshi
Sakshi News home page

ఏపీ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు

Published Wed, Mar 15 2017 1:34 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

ఏపీ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు - Sakshi

ఏపీ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు

వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2017-18) ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు

అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2017-18) ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. అమరాతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తమది ఇది రైతు రక్షణ ప్రభుత్వం అని చెప్పారు. రైతుల కోసం తొలిసారిగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించామన్నారు.

దేశంలో తొలిసారిగా బయోమెట్రిక్ ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యవసాయ దారుల ప్రయోజనాలు కాపాడేందుకు కొత్త విత్తన చట్టం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కర్నూలు జిల్లాలో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు చొరవ తీసుకున్నామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ తమ ప్రభుత్వానికి మరో ప్రాధాన్య అంశమన్నారు. 50 నుంచి 75 శాతం రాయితీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యవసాయంలో రెండు అంకెల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

బడ్జెట్ లో ముఖ్యాంశాలు

  • మొత్తం వ్యవసాయ బడ్జెట్ రూ. 18,214 కోట్లు
  • ప్రణాళిక వ్యయం రూ. 11,070 కోట్లు
  • ప్రణాళికేతర వ్యయం రూ.4,355 కోట్లు
  • వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 9,091 కోట్లు
  • సమగ్ర సాగునీటి, వ్యవసాయ రూపాంతీకరణకు రూ. 1600 కోట్లు
  • కరువు నివారణకు రూ. 1100 కోట్లు
  • పండ్ల తోటల పెంపకానికి రూ. 1015 కోట్లు
  • ఆయిల్ ఫామ్ తోటల విస్తరణకు రూ. 55 కోట్లు
  • సూక్ష్మ సేద్యానికి రూ. 200 కోట్లు
  • రైతులకు విద్యుత్ సబ్సిడీ రూ. 3300 కోట్లు
  • పంటల బీమాకు రూ. 269 కోట్లు
  • వడ్డీలేని రుణాలకు రూ. 172 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 147
  • రైతుబంధు పథకానికి రూ. 18 కోట్లు
  • పొలం పిలుస్తోంది కార్యక్రమానికి, చంద్రన్న రైతు క్షేత్రాల విస్తరణకు రూ. 17 కోట్లు
  • పావలా వడ్డీకి రూ. 5 కోట్లు
  • సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయానికి రూ. 25 కోట్లు
  • ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి రూ. 308 కోట్లు
  • సహకార రంగానికి రూ. 174 కోట్లు
  • సుస్థిర దిగుబడి, నీటి సంరక్షణకు రూ. 10 కోట్లు

 

  • ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా 156.85 లక్షల టన్నులు
  • వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14 శాతం వృద్ధి
  • పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2.85 శాతం పెరుగుదల
  • బొప్పాయి ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానం
  • చేపల, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానం
  • మొక్కజొన్న, మినుముల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానం
  • మామిడి, టమాటా ఉత్పత్తిలో రెండో స్థానం
  • మాంసం ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానం
  • పాల ఉత్పత్తిలో దేశంలో ఐదో స్థానం
  • ఉద్యాన పంటల నాణ్యత పెంచేందుకు కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం
  • నదుల అనుసంధానం ద్వారా పది లక్షల ఎకరాలకు నీరు
  • కొత్తన విత్తన చట్టానికి రూపకల్పన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement