చిలకలూరిపేటలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
గుంటూరు: చిలకలూరిపేటలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి కులానికి రూ.10 లక్షల చొప్పున పంపిణీ చేశారని ఎన్నికల అధికారులకు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
వినుకొండలో టీడీపీ అభ్యర్థి జీవీఎస్ ఆంజనేయులు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలపై విచ్చలవిడిగా కరపత్రాల అంటించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.