
'నివేదిక వచ్చిన తర్వాతే రుణమాఫీ'
హైదరాబాద్: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. వ్యవసాయశాఖ జేడీలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.
వ్యవసాయశాఖ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీల ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కోటయ్య కమిటీ ఇంకా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వలేదని, నివేదిక వచ్చిన వెంటనే రైతులకు పంట రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు.