'అది చంద్రబాబు ఆలోచన'
హైదరాబాద్: ఏపీలో గిడ్డంగుల నిర్మాణానికి రూ. 250 కోట్లు కేంద్రం మంజూరు చేసిందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కేంద్రం నుంచి ఎరువుల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. 4.15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వసామర్థ్యాన్ని పెంపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉందన్నారు. 2.59 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు చెప్పారు.
రైతులకు ఐపాడ్లు ఇవ్వాలన్నది సీఎం ఆలోచన అని మంత్రి చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులను చైతన్యపరిచేందుకు ఈ ప్రతిపాదన చేశారని వివరించారు. త్వరలో ఉపాధిహామీకి వ్యవసాయరంగాన్ని అనుబంధం చేసి రైతులకు రూ.5 వేల పెట్టుబడి తగ్గిస్తామన్నారు.