
ఉద్యాన శాఖకు రూ. 210 కోట్లు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో ఉద్యానవన శాఖకు రూ. 210 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2015-16లో ఉద్యాన శాఖకు రూ. 210 కోట్లు కేటాయించారు. ఉద్యాన అభివృద్ధి మిషన్ కు రూ. 100 కోట్లు కేటాయించినట్టు వ్యవసాయ మంత్రి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వైఎస్ఆర్ హార్టీకల్చర్ రూ. 53.01 కోట్లు.. బిందు, తుంపర్ల సేద్యానికి రూ.144 కేటాయించారు.
ఉద్యావన పంటలను ఎక్కువ విస్తీర్ణంలో పండించేందుకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రి హామీయిచ్చారు. శీతల గిడ్డంగులు, గ్రీన్ హౌస్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యావన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.