బొబ్బేపల్లి (మార్టూరు): తనను మంత్రిని చేసిన గుంటూరు, సొంత జిల్లా అయిన ప్రకాశం తనకు రెండు కళ్లులాంటివని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా పుల్లారావు స్వగ్రామమైన బొబ్బేపల్లిలో గురువారం నిర్వహించిన ఎద్దుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సంప్రదాయాలు ప్రతిబింబంచేలా పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు.
ఇప్పటికే రూ.4200 కోట్లు రుణమాఫీ కింద బ్యాంకుల్లో మొదటి విడత కింద జమ చేశామన్నారు. అనంతరం మార్టూరు తేదేపా నాయకుడు తొండెపు ఆదినారాయణ పుల్లారావుకు నాగలి బహూకరించారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, జేసీ హరిజవహర్, ఆర్‌డీవో కమ్మ శ్రీనివాసరావు,తహశీల్ధార్ సుధాకర్, ఎంపీడీవో సింగయ్య, మార్టూరు వ్యవసాయశాఖాధికారి వెంకటకృష్ణ, పీడీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షుడు మస్తానయ్య, యడ్ల పందేల నిర్వాహకుడు పెంట్యాల శరత్‌బాబు, నాయకులు పాల్గొన్నారు.