'అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకగా కొన్న మంత్రి' | prathipati pulla rao buy agri gold assets, ysrcp leaders allegation | Sakshi
Sakshi News home page

'అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకగా కొన్న మంత్రి'

Published Mon, Oct 12 2015 11:32 AM | Last Updated on Sat, Aug 11 2018 9:14 PM

'అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకగా కొన్న మంత్రి' - Sakshi

'అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకగా కొన్న మంత్రి'

గుంటూరు: అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కారుచౌకగా కొన్నారని వైఎస్సార్ సీపీ నేతలు మర్రి రాజశేఖర్, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా తన భార్య పేరుతో అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రతిపాటి కొనుగోలు చేశారని, ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

కోటప్పకొండ ప్రక్కనే ఉన్న బలిజేపల్లిలో 15 ఎకరాలు, చీమకుర్తిలో 20 ఎకరాలు మంత్రి కొన్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి భూముల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు చేయించకుంటే తామే దస్తావేదులు బయటపెడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement