సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ వైపు పోలింగ్ జరుగుతుంటే.. మరోవైపు టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పలు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై, సానుభూతిపరులపై దాడులకు దిగుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. టీడీపీ నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య ఏకంగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీకి అనుకులంగా వ్యవహరించాలంటూ పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఆమె హెచ్చరికలు జారీచేశారు. వేలు చూపిస్తూ మరి వార్నింగ్ ఇచ్చారు. ప్రత్తిపాటి భార్య తీరుపై పోలింగ్ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
► విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగడలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. ఏజెంట్‌పై కొట్టడమే కాకుండా.. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారు.
► చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సొరకాయలపాలెంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment