'ఇసుక అక్రమాల్లో లోకేష్కూ వాటా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడుతున్న ఇసుక అక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు లోకేష్కు కూడా వాటా అందుతుందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి 3 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ఇసుక ధరను 17 శాతం పెంచిన ప్రభుత్వం.. తీరా చూస్తే ఖజానాకు 500 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతుందన్నారు. ఇసుక అమ్మకాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనడానికి ఇదే నిదర్శనం అన్నారు.
ప్రత్యేక హోదా అంశంపై ఏకాభిప్రాయం కావాలని వెంకయ్యనాయుడు మెలిపెట్టడాన్ని అంబటి తప్పుపట్టారు. రాష్ట్ర విభజన సమయలో ఏకాభిప్రాయం తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ, బీజేపీలు ఉమ్మడిగా విస్మరిస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కాస్తా సీజేపీ( చంద్రబాబు జనతా పార్టీ)గా మారిందని అంబటి ఎద్దేవా చేశారు.