
సాక్షి, గుంటూరు: పంటల సాగుకు నీటిని విడుదల చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. మూడు విడతలుగా 15 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ‘రా కదలిరా’ అంటే వచ్చేవారెవరూ లేరంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు ప్రజాదరణ లేదని ధ్వజమెత్తారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
చంద్రబాబును ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ హైదరాబాద్‌కు పోవాల్సిందేనని తెలిపారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని అంబటి హెచ్చరించారు. అఫీషియల్, అనఫీషియల్‌గా పొత్తులు పెట్టుకోవటం పవన్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదని అంబటి తెలిపారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌ను ఓడించలేరని అన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లు కుప్పంను ఎందుకు పట్టించుకోలేదని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే కుప్పంలో ఎయిర్ పోర్టు కడతారట అంటూ అంబటి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment