
మీసేవ.. ‘వారిష్టం’
బినామీల నిర్వహణతో అస్తవ్యస్తం
కేటాయింపులో నిబంధనలు బేఖాతరు
పల్లెల పేరిట మంజూరు..పట్టణాల్లో ఏర్పాటు
సేవల్లో జాప్యంతో ప్రజల బేజారు
పాలమూరు : ప్రభుత్వ కార్యకలాపాల వి సృ్తతంలో భాగంగా... ప్రజలు తమ గ్రా మాల్లోనే ఉంటూ సేవలను పొందేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ అమలుతీ రు ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగు ల ద్వారా సేవలను అందించేందుకు ఏ ర్పాటు చేస్తున్న మీసేవ కేంద్రాల్లో బినామీలు పాగా వేస్తూ.. అసలు లక్ష్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఉద్దేశించిన ఈ కేంద్రాల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 400 మీ సేవ కేంద్రాలను నిర్వహిస్తుం డగా అధికశాతం ఎలాంటి అర్హతలేని వ్యక్తుల చేతుల్లో ఉండటం గమనార్హం. పలుకుబడి..
పైరవీలతో దక్కించుకున్న కేంద్రాలను చాలామంది లీజుకిచ్చి సొ మ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ని బంధనల ప్రకారం డిగ్రీ చదివి కంప్యూట ర్ పరిజ్ఞానం కలిగిన నిరుద్యోగులకే వీటి ని కేటాయించాల్సి ఉంది. కేవలం 10వ తరగతి చదివి కనీసం కంప్యూటర్ పరి జ్ఞానం లేని వ్యక్తులకు సైతం మీసేవ కేం ద్రాలను కట్టబెట్టడం ఆశ్చర్యంలో కలి గిస్తోంది. ఏపీ ఆన్‌లైన్, ఇతర సంస్థల ని ర్వహణలో జిల్లాలో కొనసాగుతున్న 400 మీసేవ కేంద్రాలు ఏ గ్రామానికి మం జూరైతే అక్కడే ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా దాన్ని అమలు జరగడం లేదు. గ్రామాల పేరుతో అనుమతి పొం ది పట్టణాల్లో నిర్వహిస్తుండటంతో గ్రా మీణులకు నిరాశే ఎదురవుతోంది. ఈ కేంద్రాల్లో సగంవరకు గ్రామీణ మీసేవ కేంద్రాలున్నాయి. 40 వరకు గ్రామీణ ప్రాంతాల పేర తీసుకొని పట్టణ ప్రాం తాల్లో నడుపుతున్నట్లు తెలుస్తోంది. దా దాపు 200 మీసేవ కేంద్రాల్లో కేవలం ఒ క్క కంప్యూటర్‌తోనే నడుపుతున్నారు. దీంతో ప్రజలకు సత్వర సేవలను అం దించలేకపోతున్నారు. జిల్లాలో అక్రమాలు అనేకం చోటుచేసుకున్నా అడిగే నాథుడే కరవయ్యాడు. ఇక మీసేవ కేంద్రాల్లో తగినంత మంది ఆపరేటర్లను నియమించకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. హెచ్‌సీఎల్‌కు చెం దిన అర్బన్ కేంద్రాల్లో పని ఒత్తిడి అధికం గా ఉన్నా అందుకు తగినట్లుగా ఆపరేటర్ల ను నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ఆన్‌లైన్, సీఎంఎస్ సెంటర్లలోనూ తగినన్ని కంప్యూటర్లు లేకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోం ది. ఒకే సిస్టంతో పనిచేస్తున్న మీసేవా కేంద్రాలు జిల్లాలో 200 వరకు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
గాడిలో పెడతాం..!
జిల్లాలోని పలు మీసేవ కేంద్రాల నిర్వహణ తీరుపై అప్పుడప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతాం. మీసేవ కేంద్రాలను గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్నాం. ఒకరికి మంజూరైన కేంద్రాన్ని మరొకరికి లీజుకిస్తే బాధ్యులపై చర్యలు తప్పవు. ఏ గ్రామానికి మంజూరైన కేంద్రాన్ని అక్కడే ఏర్పాటు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షి ంచేదిలేదు. ఇలాంటి వాటిపట్ల విచారణ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం.
-ఎల్.శర్మణ్,
జాయింట్ కలెక్టర్.